శనివారం 06 జూన్ 2020
Sangareddy - May 22, 2020 , 01:12:08

సరిహద్దులో స్వచ్ఛందంగా..

 సరిహద్దులో స్వచ్ఛందంగా..

సడలింపులున్నా సకలం బంద్‌ 

 కంగ్టి మండల కేంద్రంలో ప్రత్యేక తీర్మానం 

కంగ్టి: కరోనా నేపథ్యంలో 55 రోజుల పాటు లాక్‌డౌన్‌ పాటించిన ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులతో కాస్త ఊరట చెందారు. కానీ సంగారెడ్డి జిల్లా సరిహద్దులో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. కంగ్టి మండలం కేంద్రం కర్ణాటకకు 3కిలోమీటర్లు, మహారాష్ట్రకు 8కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మూడో విడుత లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వగానే ఇక్కడ వ్యాపారాలు మొదలయ్యాయి. వాహనాలూ రోడ్డెక్కాయి. అయితే ఇతర రాష్ర్టాలకు చెందిన ప్రజలు కూడా అధికంగా వస్తుండడంతో పంచాయతీ పెద్దలు గ్రామ సభను నిర్వహించారు. ప్రజల కోరిక మేరకు నెలాఖరు వరకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని తీర్మానించారు. దీంతో మండల కేంద్రమైన కంగ్టిలో గురువారం  ఎలాంటి దుకాణాలు తెరుచుకోలేదు. పోలీసులు, అధికారుల ఒత్తిడి లేకుండానే ప్రజలు సహకరించడం కొసమెరుపు. 


logo