సోమవారం 13 జూలై 2020
Sangareddy - May 21, 2020 , 05:33:34

భౌతికదూరంతో బస్సుల్లో ప్రయాణం

భౌతికదూరంతో బస్సుల్లో ప్రయాణం

రెండో రోజు తిరిగిన 267 బస్సులు

సంగారెడ్డి: కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో 56 రోజుల పాటు బస్సుల ప్రయాణం నిలిచిపోగా, మంగళవారం నుంచి బస్సులు ప్రారంభించారు. బుధవారం ఉమ్మడి జిల్లా పరిధిలో బస్సులు భౌతికదూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించి రవాణా చేశారు. రెండోరోజు మెదక్‌ రీజియన్‌ పరిధిలో 267 బస్సులు ఆర్టీసీ అధికారులు నడిపించారు. ప్రతి బస్సులో శానిటైజర్‌ అందుబాటులో ఉంచి డ్రైవర్‌, కండక్టర్‌, ప్రయాణికులు ఉపయోగించాలని సూచిస్తున్నా. ఉమ్మడి జిల్లాలో 56 శాతం బస్సులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.logo