శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - May 15, 2020 , 23:58:41

హత్యకేసు నిందితుడికి రిమాండ్‌

హత్యకేసు నిందితుడికి రిమాండ్‌

జహీరాబాద్‌: పట్టణంలోని బాగారెడ్డిపల్లికి చెందిన మ్యాతరి కుమార్‌ (25) హత్య చేసిన వ్యక్తిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ గణపత్‌ జాదవ్‌ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గురువారం రాత్రి బాగారెడ్డిపల్లికి చెందిన మ్యాతరి కుమార్‌ (25), స్నేహితుడు సంతోష్‌తో కలిసి కల్లు తాగేందుకు గ్రామంలోని కల్లు దుకాణం నిర్వాహకురాలు పుణ్యమ్మ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో పుణ్యమ్మ కుమారుడు ఈప్తి కృష్ణ కల్లు లేదని తెలుపడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుంది. అదేవిధంగా గతంలో కూడా మ్యాతరి కుమార్‌ కల్లు విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో మళ్లీ గొడవ జరుగడంతో ఆగ్రహానికి గురైన కృష్ణ ఇంట్లో ఉన్న ఇనుప పైపుతో మ్యాతరి కుమార్‌ తలపై, కడుపులో, కాళ్లపై బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. దీంతో కుమార్‌ను సంతోష్‌ ఇంటికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి బాలమ్మ ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని తెలిపారు. సమావేశంలో జహీరాబాద్‌ పట్టణ సీఐ సైదేశ్వర్‌, ఎస్సైలు వెంకటేశ్‌, సమద్‌ ఉన్నారు.logo