ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - May 14, 2020 , 22:37:47

కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలి

కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

జహీరాబాద్‌/చిలిపిచెడ్‌/హుస్నాబాద్‌ :  కరోనాను నివారించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కృషిచేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మంత్రి ఈటల గురువారం హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, కార్యదర్శి యోగితా రాణాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గురువారం జహీరాబాద్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో జహీరాబాద్‌, మొగుడంపల్లి, కోహీర్‌, న్యాల్‌కల్‌, ఝరాసంగం, రాయికోడ్‌ మండలాలకు చెందిన వైద్యులు, సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనాను నివారించేందుకు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వారు గ్రామాలకు వస్తే వెంటనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని సూచించారు.  ఉండగా, గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం చిలిపిచెడ్‌ పోలీస్‌ స్టేషన్‌ను నర్సాపూర్‌ సీఐ నాగయ్యతో కలిసి డీఎస్పీ సందర్శించారు. అక్కన్నపేట మండలంలోని జనగామ, కట్కూర్‌ గ్రామాల్లో ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కుటుంబాలకు ఏసీపీ మహేందర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  


logo