బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - May 14, 2020 , 01:11:07

కొత్త పద్ధతిలో పంటలు సాగు చేయాలి

కొత్త పద్ధతిలో పంటలు సాగు చేయాలి

జహీరాబాద్‌: వ్యవసాయశాఖ అధికారులు పంటలు సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ తెలిపారు. బుధవారం జహీరాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్‌లోని వ్యవసాయశాఖ అధికారులు, సహకార సంఘం చైర్మన్లకు ఉమ్మడి డీసీఎంఎస్‌ చైర్మన్‌ మాల్కాపూరం శివకుమార్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. రైతులు కొత్త పద్ధతిలో పంటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వం జహీరాబాద్‌ డివిజన్‌కు సోయాబీన్‌ విత్తనాలు 500 క్వింటాళ్లు, జనుము విత్తనాలు 650 క్వింటాళ్లు, జీలుగ విత్తనాలు 129.6 క్వింటాళ్లను కేటాయించిందని తెలిపారు.


logo