శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - May 13, 2020 , 00:25:24

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

జగదేవ్‌పూర్‌ /సిద్దిపేట అర్బన్‌/ చిన్నకోడూరు: రైతులు తీసుకున్న రుణాన్ని రూ.25వేలు ఏకకాలంలో ప్రభుత్వం మాఫీ చేస్తున్న సందర్భంగా జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , ఎంపీపీ బాలేశం గౌడ్‌, జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రంగారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, మండల నాయకులతో కలసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సిద్దిపేటలోని మిట్టపల్లిలో పీఏసీఎస్‌ చైర్మన్‌ చింతల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, డైరెక్టర్లు రాము, రాజు, లక్ష్మి, సిద్ధవ్వ, రాంరెడ్డి, సీఈవో ఎల్లయ్యలతో కలిసి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. చిన్నకోడూరులో ఏఎంసీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌, సర్పంచ్‌ ఉమేశ్‌చంద్ర, ప్రముఖ వైద్యుడు సీహెచ్‌ రామచందర్‌రావు ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్దచెరువులోకి వస్తున్న గోదారమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.  


logo