గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - May 11, 2020 , 01:19:54

నిరుపేదలకు మేమున్నామని..

నిరుపేదలకు మేమున్నామని..

 • చేర్యాల : ఆకునూరు, కాశేగుడిసెల గ్రామాల్లో  మైనార్టీ నాయకుడు ఎండీ ఇక్బాల్‌  పేద ముస్లిం కుటుంబాలు, ఆశ వర్కర్లకు సరుకులు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  విజయ్‌రావు తల్లితో కలిసి గంగిరెద్దుల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
 • దౌల్తాబాద్‌:  గాజులపల్లిలో భారతీయ మల్టీ వర్కర్స్‌ యూనియన్‌  ఆధ్వర్యంలో దౌల్తాబాద్‌ ఎస్సై చంద్రశేఖర్‌ పేదలకు సరుకులు అందజేశారు.
 • కొండపాక :  కుకునూర్‌పల్లి పంచాయతీ కార్మికులను మాజీ సర్పంచ్‌ ఐలం యాదవ్‌, ముద్దాపూర్‌, బొబ్బాయిపల్లి పంచాయతీ కార్మికులను డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవి రవీందర్‌ సన్మానించి బట్టలు, సరుకులు అందజేశారు.
 • మెదక్‌ :  పట్టణంలోని  పేదలకు మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ సరుకులు పంపిణీ చేశారు.  
 • టేక్మాల్‌ : పల్వంచలో ఎస్సై లింబాద్రి పేదలకు సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శివకుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ యశ్వంత్‌రెడ్డి ఉన్నారు.
 • తూప్రాన్‌ రూరల్‌ :  పట్టణంలోని ఫ్లెక్సీ ప్రింటింగ్‌ కార్మికులు, చిత్రకళాకారులకు తూప్రాన్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • హత్నూర :  బడంపేటలోని యక్షికూడలి విత్తన సంఘం ఆధ్వర్యంలో మేనేజర్‌ వీరేశం జర్నలిస్టులకు సరుకులు పంపిణీ చేశారు.  
 • సంగారెడ్డి : 29వ వార్డులో కౌన్సిలర్‌ పవన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో దాతలు బాగారెడ్డి, సంగమేశ్వర్‌రెడ్డి, భగవంత్‌రెడ్డి, చంద్రయ్య, మోహన్‌రెడ్డి పేదలకు సరుకులు పంపిణీ చేశారు. సిద్దిపేట టౌన్‌ : సిద్దిపేట వాసవీ వనితా క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ పుల్లూరు శ్రీనివాస్‌ మోటరు మెకానిక్‌లకు బియ్యాన్ని పంపిణీ చేశారు. 
 • బొల్లారం :  3వ వార్డు కౌన్సిలర్‌ సాయికిరణ్‌ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్‌రెడ్డితో కలిసి పేద బ్రాహ్మణులకు సరుకులు పంపిణీ చేశారు.  
 • గుమ్మడిదల :  అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధి రవిలోచన్‌ గుమ్మడిదల, నల్లవల్లి, మంభాపూర్‌, వీరారెడ్డిపల్లి, మొల్లగూడెం, బొంతపల్లి, అన్నారం గ్రామాల్లోని కళాకారులకు, పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • జిన్నారం: కాంగ్రెస్‌ మెదక్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్‌ జిన్నారం మండల జర్నలిస్టులకు సరుకులు, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీలు గంగురమేశ్‌, నాగేందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి  పంచాయతీ కార్మికులకు సరుకులు అందజేశారు. 
 • రామచంద్రాపురం : భారతీనగర్‌ డివిజన్‌లోని బొంబాయికాలనీలో  పేదలకు టీఆర్‌ఎస్‌ నాయకులు సురేందర్‌, ప్రసాద్‌, కృష్ణ, మహేశ్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సింధు, అంజయ్యయాదవ్‌, ఎంఐజీలో మహిళా మండలి సభ్యురాలు రాణి ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు పండ్లు, కూరగాయలను అందజేశారు. ఎంఐజీలోని అనాథాశ్రమానికి టీఆర్‌ఎస్‌ నాయకుడు సుధాకర్‌ బియ్యం అందజేశారు. 


logo