ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - May 11, 2020 , 01:19:55

తూకం వేసి.. లారీ నింపి..

తూకం వేసి.. లారీ నింపి..

తొగుట: తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆదివారం ధాన్యం కొనుగోలు జరిగాయి. వర్షం వస్తే ధాన్యం తడుస్తుందనే మహిళ రైతులు ధాన్యాన్ని తూకం వేయడానికి తామే కాంట పెట్టి, తూకం వేసిన 800 బస్తాలను లారీలో నింపారు. సెలవు రోజు హమాలీలు పనికి రాకపోవడంతో ఆందోళన చెందిన పెద్దమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన సాకలి లక్ష్మి, సాకలి నాగవ్వ, తాళ్ల రాజమణి, తాళ్ల నర్సవ్వ, బోయిని లక్ష్మి హమాలీ పనిని చేసి చూపించారు. దీంతో గ్రామ సర్పంచ్‌ వరలక్ష్మి, ఎంపీటీసీ సుమలత అభినందించారు. 


logo