ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - May 09, 2020 , 00:25:13

పెళ్లిరోజే ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

పెళ్లిరోజే ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

చేర్యాల, నమస్తే తెలంగాణ : భార్య పుట్టింటికి వెళ్లిందని పెళ్లిరోజే ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన సిద్ధులుకు ఆరుసంవత్సరాల కింద వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్య 20 రోజుల కింద పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన సిద్ధులు చుంచనకోట శివారులోని గుట్టపై ఆత్మహత్య చేసుకుంటున్నానని బంధువులకు వీడియో సందేశం పంపాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై మోహన్‌బాబు ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది సిద్ధులను కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


logo