ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - May 09, 2020 , 00:26:02

స్వగ్రామాలకు వచ్చినవారందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలి

స్వగ్రామాలకు వచ్చినవారందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలి

  • హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌

చేర్యాల, నమస్తే తెలంగాణ/ చిలిపిచెడ్‌ : ఇతర రాష్ర్టాల నుంచి స్వగ్రామానికి వచ్చిన  కార్మికుల కుటుంబాలను శుక్రవారం హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, చేర్యాల సీఐ రఘు, ఎస్‌ఐ మోహన్‌బాబు, వైద్య సిబ్బంది కలిశారు. స్వగ్రామాలకు వచ్చిన కార్మికులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ.. కరోనా వైరస్‌ నివారణకు కృషి చేయాలని కోరారు. అలాగే, చిలిపిచెడ్‌ మండలం గౌతాపూర్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన కార్మికుల వివరాలను ఎస్‌ఐ మల్లారెడ్డి సేకరించారు. స్వగ్రామానికి వచ్చిన వారందరూ 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని, ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది రేఖ్యనాయక్‌, నర్సింగ్‌రావు పాల్గొన్నారు.logo