మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - May 07, 2020 , 00:34:07

మార్కెట్‌లో అన్ని వసతులు కల్పిస్తాం

మార్కెట్‌లో అన్ని వసతులు కల్పిస్తాం

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ/పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ / అమీన్‌పూర్‌ :  నగరంలోని మలక్‌పేట్‌ ఉల్లి మార్కెట్‌ రెడ్‌జోన్‌లో ఉన్న కారణంగా పటాన్‌చెరుకు తరలించడంతో బుధవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, వ్యాపారులకు అన్ని వసతులను కల్పిస్తున్నామన్నారు. రూ.62కోట్ల ఖర్చుతో ఆధునిక మార్కెట్‌ను నిర్మిస్తామ న్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హారికవిజయ్‌కుమార్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ గడీల కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో రూ.50లక్షలతో నిర్మిస్తున్న ఐదు తరగతి గదులతో పాటు అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడ పంచాయతీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.  logo