శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - May 07, 2020 , 00:34:06

నేడు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

నేడు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ : నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే రహమాన్‌ ఫంక్షన్‌హాల్‌లో జన్మదిన వేడుకల్లో పాల్గొని, అనంతరం నియోజకవర్గంలోని జర్నలిస్టులు, 500 మంది నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంబీఆర్‌ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే అభిమానులు, యువకులు రక్తదానం చేయనున్నట్లు తెలిపారు.