సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - May 05, 2020 , 23:42:59

పేదలకు అండగా..

పేదలకు అండగా..

 • పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు మేరాజ్‌ఖాన్‌ ముత్తంగిలోని పలు కాలనీల్లో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ అంజిరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి, సీనియర్‌ నాయకులు సఫానదేవ్‌, కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ పటాన్‌చెరులో సరుకులు అందజేశారు. 
 • రామచంద్రాపురం: ఆర్సీపురంలో డివిజన్‌లో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుష్పానగేశ్‌, కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌, ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి అందజేశారు. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకురాలు గోదావరిఅంజిరెడ్డి సరుకులు పంపిణీ చేశారు.
 • జిన్నారం : జిన్నారంలో టీఆర్‌ఎస్‌ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్‌, లక్ష్మీపతిగూడెంలో ఎండీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సరుకులు అందజేశారు.  
 • బొల్లారం : ఆహార సహాయ కేంద్రం ద్వారా పలు వార్డుల్లోని పేదలకు చైర్‌పర్సన్‌ కొలన్‌ రోజారాణి, కౌన్సిలర్లు చంద్రారెడ్డి, గోపాలమ్మ, సంతోషి, సంధ్య, ప్రభు, సతీశ్‌ సరుకులు పంపిణీ చేశారు. మైలాన్‌ పరిశ్రమ సహకారంతో 16వ వార్డు కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, ఆర్వో శ్రీధర్‌ సరుకులు పంపిణీ చేశారు.
 • చేగుంట : కర్నాల్‌పల్లిలో ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ జనగామ రాములుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్‌ సరుకులు అందించారు.  
 • చేర్యాల, నమస్తే తెలంగాణ : ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా వేచరేణిలో టీఆర్‌ఎస్వీ నేత ఏర్పుల మహేశ్‌ ఆధ్వర్యంలో చేర్యాల జడ్పీటీసీ మల్లేశం, కొమురవెల్లి జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, ఎంపీపీ తలారి కీర్తన, ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి సరుకులు పంపిణీ చేశారు. చేర్యాలలో కౌన్సిలర్‌ చంటి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపరాణి, వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌రెడ్డి, యోధ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. 
 • చిన్నశంకరంపేట : మాజీ ఉప సర్పంచ్‌ మేడిశ్రీమాన్‌, మేడి బాలపోచయ్య సమకూర్చిన సరుకులను సర్పంచ్‌ రాజిరెడ్డి పంపిణీ చేశారు.
 • అక్కన్నపేట: అంతకపేటలో ఎన్‌ఆర్‌ఐ అశోక్‌రెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 
 • హుస్నాబాద్‌టౌన్‌: ఇటుకబట్టీలో పనిచేసే కార్మికులకు ఆర్టీసీ కార్మికులు సరుకులు పంపిణీ చేశారు. హుస్నాబాద్‌, అక్కన్నపేట, చిగురుమామిడి మండలాల్లోని పలు గ్రామాల్లో హిరా ఫౌండేషన్‌ కరీంనగర్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ముఫ్తి మహ్మద్‌ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు.  
 • మెదక్‌ టౌన్‌ : మెదక్‌ 13వ వార్డు కౌన్సిలర్‌ సులోచన సమకూర్చిన సరుకులను ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. 
 • మద్దూరు : లద్నూర్‌, బెక్కల్‌ గ్రామాల్లో ఎంపీటీసీ కూరెళ్ల రాజుగౌడ్‌ సరుకులు పంపిణీ చేశారు. సర్పంచ్‌ ఆలేటి రజితాయాదగిరి పోలీస్‌, రెవెన్యూ, మండల పరిషత్‌ కార్యాలయాల సిబ్బందికి కూరగాయలు అందజేశారు.
 • సిద్దిపేట జోన్‌ నెట్‌ వర్క్‌ : సిద్దిపేటలో కొత్తపల్లి వేణుగోపాల్‌ 20 మంది గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. సిద్దిపేట అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు మధుసూదన్‌, ఉపాధ్యక్షుడు రత్నాకర్‌ సరుకులు పంపిణీ చేశారు. సిద్దిపేట టీపీటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు రాములు కార్మికులకు సరుకులు అందజేశారు. నారాయణరావుపేట, చిన్నకోడూరు మండల కేంద్రాల్లో పేద విశ్వబ్రాహ్మణులకు రాష్ట్ర కన్వీనర్‌ నర్సింహాచారి సరుకులు పంపిణీ చేశారు. 
 • ములుగు : తునికిబొల్లారం, సింగన్నగూడ, క్షీరసాగర్‌ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కేబీజీ ట్రస్ట్‌ తరఫున పీఏసీఎస్‌ చైర్మన్‌ బట్టు అంజిరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి బాబుగౌడ్‌ ఆధ్వర్యంలో రైతులు, కూలీలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • గజ్వేల్‌ రూరల్‌ : మక్తమాసాన్‌పల్లి, మధిర గ్రామం హైమత్‌నగర్‌, బంగ్లావెంకటపూర్‌లో గడ ఓఎస్డీ ముత్యంరెడ్డి, జడ్పీటీసీ మల్లేశం సరుకులు పంపిణీ చేశారు.
 • గజ్వేల్‌ అర్బన్‌ : గజ్వేల్‌ పట్టణంలో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ నాయకులు సరుకులు, ప్రభుత్వ దవాఖానలో రోగుల బంధువులకు పులిహోర పంపిణీ చేశారు. ఐవీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్‌ ఉమ్మడి జిల్లా నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 10వ వార్డులో సీఐ మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్‌ రహీం అంబలి పంపిణీ చేశారు.  ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ జన్మదినం సందర్భంగా ప్రజ్ఞాపూర్‌లోని ఆశాజ్యోతి కేంద్రంలో చిన్నారులకు సరుకులు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. 
 • కొల్చారం : కొల్చారం పొలీసులు మండల వ్యాప్తంగా 62 మంది పేదలను గుర్తించి ఏఎస్పీ నాగరాజుతో కలిసి సరుకులు అందజేశారు.  
 • చిలిపిచెడ్‌ : అంతారంలో సర్పంచ్‌ అశోక్‌గౌడ్‌ పేదలకు ఐఐటీ హైదరాబాద్‌ తరుపున సరుకులు పంపిణీ చేశారు.  
 • సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ : సదాశివపేట పట్టణం బసవసేవా సదన్‌లో డాక్టర్ల అసోసియేషన్‌ సహకారంతో 400 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సరుకులు అందజేశారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో గ్రామ రెవెన్యూ సహాయకులకు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి సరుకులు పంపిణీ చేశారు.  
 • న్యాల్‌కల్‌ : హద్నూర్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ హెచ్‌ఎం కరుణం భీంరావు కులకర్ణి ఐదు కిలోల చొప్పున పేదలకు జొన్నలు పంపిణీ చేశారు.  


logo