మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - May 01, 2020 , 00:51:24

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

ఉమ్మడి మెదక్‌ జిల్లా నెట్‌వర్క్‌: కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటూ ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మిరుదొడ్డిలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య తనిఖీ చేశారు. మర్కూక్‌ మండల పరిధిలోని వర్దరాజ్‌పూర్‌, మర్కూక్‌ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవి రవీందర్‌ పరిశీలించి కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హుస్నాబాద్‌లోని పలు రైస్‌ మిల్లులను ఆర్డీవో జయచంద్రారెడ్డి సందర్శించి మిల్లు యజమానులు, హమాలీలతో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా మొత్తంలో 7లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగితే డివిజన్‌లోనే 3లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ఆయన తెలిపారు. హత్నూర, రెడ్డిఖానాపూర్‌ గ్రామాల్లో ఐకేపీ ఏపీడీ సూర్యారావు, డీపీఎం శ్రీనివాస్‌, ఏపీఎం మధులత ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తొగుట మండలం తుక్కాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ఎంపీడీవో రాజిరెడ్డి విచారణ చేపట్టి, అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ములుగు మండలంలోని తునికిబొల్లారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా కోఆపరేటివ్‌ అధికారి మనోజ్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులకు, కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రాయికోడ్‌ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ‘వరము’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని రాయికోడ్‌ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు హరిత పరిశీలించారు. వరము ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 6 వేల క్వింటాళ్ల శనగలను కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. సదాశివపేట పట్టణం ప్రభుత్వం జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. కొల్చారం మండలంలోని అప్పాజిపల్లి, రంగంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ మంజులాకాశీనాథ్‌ తనిఖీ చేశారు.logo