శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Apr 27, 2020 , 00:34:05

డ్రోన్‌తో పట్టేస్తాం..

డ్రోన్‌తో పట్టేస్తాం..

చేర్యాల, హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాధి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో చేర్యాలతో పాటు కొమురవెల్లి, చేర్యాల, మద్దూరు మండలాల్లోని అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఏసీపీ మహేందర్‌ ఆదేశాల మేరకు చేర్యాల సీఐ రఘు, ఎస్‌ఐలు మోహన్‌బాబు, నరేందర్‌రెడ్డి, సంపత్‌  ప్రజలు రోడ్ల పైకి రాకుండా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో పోలీసులు డ్రోన్‌ కెమెరాతో ఆదివారం లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ఏసీపీ మహేందర్‌, సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్‌, మల్లెచెట్టు చౌరస్తాల్లో డ్రోన్‌ కెమెరాతో వివిధ కాలనీల్లో జనసమూహాలను పరిశీలించారు. అనంతరం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేసి డబుల్‌ రైడింగ్‌, మాస్క్‌ లేకుండా వాహనం నడుపుతున్న వారి వాహనాలను సీజ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఏసీపీ మహేందర్‌ సూచించారు.