శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Apr 12, 2020 , 23:54:12

మానవతామూర్తులు

మానవతామూర్తులు

  • పేదలకు సరుకుల పంపిణీ

ఉమ్మడి మెదక్‌ జిల్లా బృందం: పటాన్‌చెరు నియోజకవర్గంలో దాతలు బాగా స్పందిస్తున్నారని  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు పట్టణంలో ఆటోడ్రైవర్లకు, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెత్త సేకరించే కార్మికులకు ఎమ్మెల్యే గూడెం నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. జిన్నారం గిరిజన గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌తో కలిసి ఆటోడ్రైవర్లకు, నాయీ బ్రాహ్మణులకు, కూలీలకు, నిత్యావసర సామగ్రిని అందించారు. గుమ్మడిదల మండలం దోమడుగులో యువకులు గ్రామంలో నిరుపేదలకు సరుకులను పంపిణీ చేశారు. బొంతపల్లిలో ఎంపీ పీ సద్దిప్రవీణ భాస్కర్‌రెడ్డి  కూరగాయలను పంపిణీ చేశారు. బొల్లారం మున్సిపాలిటీలోని బాలాజీనగర్‌లో బొల్లారానికి చెందిన కాశీరెడ్డి 3 క్వింటాళ్ల బియ్యాన్ని, నిత్యావసర సరుకులను అందజేశారు. లక్ష్మీనగర్‌లో మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో  సరుకులు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద ప్రజలకు జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు రవీందర్‌రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఉల్లిపాయలను పంపి ణీ చేశారు.  సంగారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని  వీరభద్రనగర్‌లోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి పాల్గొని ప్రజలకు సరుకులు అందజేశారు. అలాగే సంగారెడ్డి 33వ వార్డు వోడీఎఫ్‌ మధురానగర్‌ కాలనీ సొసైటీ ఆధ్వర్యంలో  పారిశుధ్య కార్మికులు, విద్యుత్‌ లైన్‌మన్‌లు, హెల్పర్లు, వాటర్‌ సైప్లె సిబ్బందికి సరుకులు,  బట్టలు అందజేసి సన్మానం చేశారు. కోహీర్‌ మండలంలోని దిగ్వాల్‌ గ్రామానికి చెందిన 4వ వార్డు సభ్యురాలు ఫాతిమా బేగంబాబా  కూరగాయలు, బియ్యం, తదితర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రాయికోడ్‌  మండల పరిధిలోని ధర్మాపూర్‌లో నిరుపేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో పేద కుటుంబాలకు, పట్టణానికి చెందిన ఐవీఎఫ్‌ సిద్దిపేట జిల్లా యూత్‌ అధ్యక్షుడు గోలి సంతోష్‌కుమార్‌, ఉమ్మడి జిల్లా పొలిటికల్‌ వింగ్‌ అధ్యక్షుడు నంగునూరి సత్యనారాయణ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే లక్ష్మీప్రసన్న కాలనీ పేదలకు కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

మర్కూక్‌ మండలం అంగడికిష్టాపూర్‌లోకృష్ణారెడ్డి సహకారంతో ఎంపీపీ పాండుగౌడ్‌ గ్రామంలోని  కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ములుగు మండలంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బట్టు అంజిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కుక్కల నరేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో సరుకులు, కొండపాక మండల కేంద్రంలో జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్‌ మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు బియ్యం, సరుకులను పంపిణీ చేశారు. అలాగే దుద్దెడలో సఫాయి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులు సరుకులు పంపిణీ చేశారు. చేర్యాల మండలంలోని ముస్త్యాలలో ఎన్‌ఆర్‌ఐ పెడుతల అమరేందర్‌రెడ్డి తన కూతురు అఖిలారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా 30 కుటుంబాలకు చెందిన పారిశుద్ధ్య సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశవర్కర్లకు సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి,ఎస్‌ఐ మోహన్‌బాబుతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయించారు. బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రామదాసు వలస కూలీలకు నిత్యావసర వస్తువులను అందించారు.మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్‌ రామలింగేశ్వర రైస్‌ మిల్లు ఆధ్వర్యంలో పారిశుధ్యకార్మికులకు రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ మేక సంతోష్‌కుమార్‌ బియ్యం, సరుకులను అందజేశారు. అదేవిధంగా లద్నూర్‌లో పాస్టర్‌ డేవిడ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సంపత్‌ చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు బియ్యం,  సరుకులను పంపిణీ చేశారు.

హుస్నాబాద్‌పట్టణంలో చిక్కుకున్న గోదావరిఖనికి చెందిన కుటుంబాలకు స్థానిక ఎస్‌ఐ దాస సుధాకర్‌, కీర్తి బుక్‌స్టాల్‌ యజమాని శ్రీదేవి ఆధ్వర్యంలో నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  కోహెడలో ఎస్‌ఐ రాజ్‌ కుమా ర్‌ ఇతర రాష్ర్టాల వలస కూలీలకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పోరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్‌ తిరుపతిరెడ్డి సొంత ఖర్చులతో కూరగాయలు పంపిణీ చేశారు. మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణంలో ఈస్టర్‌ వేడుకల సందర్భంగా చర్చి పాస్టర్‌ ప్రదీప్‌ ఉమార్‌, పాతూరి రాజు చేతుల మీదుగా పేదలకు అన్నదానం చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ బియ్యం అందజేశారు. కౌన్సిలర్లు యాదగిరి, శారద నాగరాజు బియ్యం అందజేశారు. మండలంలోని ఝాన్సీలింగాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ పంబాల జ్యోతి బియ్యం,సరుకులను అందజేశారు. నిజాంపేట మండలంలోని వెంకటాపూర్‌(కె) గ్రామంలో మాజీ సర్పంచ్‌ సత్యనారాయణరెడ్డి  ఖర్చులతో బియ్యం, సరుకులు అందజేశారు. నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌ సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులను అందజేశారు.

చేగుంట మండలం చందాయిపేటలో ఎన్‌ఆర్‌ఐ సుదర్శన్‌ కోరిక మేరకు గ్రామంలోని పేదలకు  గ్రామ సర్పంచ్‌ బుడ్డ స్వర్ణలత, ఎస్‌ఐ. సుభాష్‌ గౌడ్‌ సరుకులు అందజేశారు. చిన్నశంకరంపేట మండలంలో సంకల్ప ఫౌండేషన్‌ వారి సౌజన్యంతో పేదలకు రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌, ఎస్‌ఐ మహ్మద్‌గౌస్‌  సరుకులను పంపిణీ చేశారు.  తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్‌(పీటీ),బ్రాహ్మణపల్లిలో  నీ నేస్తం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు కూరగాయలు, సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్‌ లక్ష్మీబాయి,బీజేపీ రాష్ట్ర నాయకులు సాయిబాబాగౌడ్‌, మహేశ్‌గౌడ్‌, ఆధ్వర్యంలో పోలీసులకు, సరుకులు పంపిణీ చేశారు.  గ్రోస్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు జాయ్‌ముర్రే ఆధ్వర్యంలో మెదక్‌లో బియ్యం పంపిణీ చేశారు.   logo