మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Apr 06, 2020 , 23:06:56

అన్నదాతలు అధైర్యపడొద్దు

అన్నదాతలు అధైర్యపడొద్దు

  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు షురూ

పెద్దశంకరంపేట/చిన్నశంకరంపేట/దుబ్బాక, నమస్తే తెలంగాణ/కోహెడ/కొండపాక/చేగుంట : మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మక్క, వరి, శనగ కొనుగోలు కేంద్రాలను నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూ పాల్‌రెడ్డి, మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దని సూచించారు. వరి క్విం టాలుకు రూ.1835, మొక్క రూ.1760, శనగలు రూ.4875 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. రైతులకు టోకెన్లు అందజేయాలని, రైతులందరూ ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు రాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. అనంతరం పట్టణంలో ఫైరింజిన్‌ ద్వారా ద్రవనాన్ని పిచికారి చేసే విధానాన్ని పరిశీలించారు. చేగుంట మండల పరిధి ఇబ్రహీంపూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో పులిమామిడి, కిష్టాపూర్‌ గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. అలాగే, చిన్నశంకరంపేట మం డల పరిధి మడూర్‌, గజగట్లపల్లి, టీ.మాందాపూర్‌, ఎస్‌.కొండాపూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ పట్లోరి మాధవి, ఎంపీపీ భాగ్యలక్ష్మి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, జడ్పీటీసీ, రెవెన్యూ, వ్యవసాయ, ఐకేపీ అధికారులతో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి, గొట్లమిట్ట, నారాయణపూర్‌, శ్రీరాములపల్లి, నకిరకొమ్ముల, పరివేద, చెంచెల్‌చెర్వుపల్లి వెంకటేశ్వర్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల స్థలాలను కోహెడ ప్యాక్స్‌ చైర్మన్‌ దేవేందర్‌రావు పరిశీలించారు. కొండపాక మండలంలోని కొండపాక, మర్పడగ, సిరిసినగండ్ల, కుకునూర్‌పల్లి, మంగోల్‌, అంకిరెడ్డిపల్లి, దుద్దెడ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు త్వరలో ప్రారంభమవుతాయని వ్యవసాయశాఖ అధికారి ప్రభాకర్‌రావు తెలిపారు. చిన్నకోడూ రులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఈ నెల 8న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని సిద్దిపేట జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ తెలిపారు. చిన్నకోడూరు మండల పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ సీఈవో శ్రావణ్‌, ఏఎంసీ, పీఏసీఎస్‌ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. సిద్దిపేటలోని కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రేపటి నుంచి కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 


logo