బుధవారం 03 జూన్ 2020
Sangareddy - Apr 05, 2020 , 23:51:01

ఆదర్శప్రాయుడు జగ్జీవన్‌రామ్‌

ఆదర్శప్రాయుడు జగ్జీవన్‌రామ్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లా బృందం: మాజీ  ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ ఆదర్శప్రాయుడని పలువురు ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఆదివారం ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, జెడ్పీ సీఈవో శ్రావణ్‌లు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుబ్బాకలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి  జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. సిద్దిపేటలోని బీజేఆర్‌ చౌరస్తా వద్ద   సుడా డైరెక్టర్‌ ముత్యాల కనకయ్య, తొగుట మండలం తుక్కాపూర్‌లో సర్పంచ్‌ చంద్రం, కోహెడ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కొక్కుల కీర్తి, కోహెడ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌  నవ్య, తీగలకుంటపల్లిలో  చంద్రశేఖర్‌ రెడ్డి, శనిగరంలో సర్పంచ్‌ కర్ర జయశ్రీ, గజ్వేల్‌ పట్టణంలో కౌన్సిలర్‌ చందు, ములుగులో పీఏసీఎస్‌ చైర్మన్‌ అంజిరెడ్డి, కొండపాక జెడ్పీటీసీ అనంతుల అశ్విని, కొండపాక సర్పంచ్‌ చిట్టి మాధురి జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. హుస్నాబాద్‌ పట్టణంలోని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆకుల రజిత ఇంటిలో, అంబేద్కర్‌చౌరస్తాలో దళితసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో, బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల, మద్దూరు మండలంలోని లద్నూర్‌లో మాజీ సర్పంచ్‌ బాలరాజు, ములుగు మండల కేంద్రంలో అంబేద్కర్‌ సంఘం అధ్యక్షుడు పొట్టి ఆంజనేయులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ బట్టు అంజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహ్మద్‌ జహంగీర్‌ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో సర్పంచ్‌ లద్ద ప్రీతి, ఎంపీటీసీ సురేశ్‌, రేగోడ్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఎంఆర్‌ఐ శ్యాంరావు  జగ్జీవన్‌రామ్‌  చిత్రపటాలకు నివాళులర్పించారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రక్కన జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి కలెక్టర్‌ హనుమంతరావు, టీఆర్‌ఎస్‌ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల నర్సింలు, ఆత్మకమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నారాయణఖేడ్‌ మండలం చల్లగిద్ద తండాలో ఎంపీపీ చాందిబాయి చౌహాన్‌, సర్పంచ్‌ సుశీల, బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌చౌహాన్‌ జగ్జీవన్‌రామ్‌, కోహీర్‌లో జెడ్పీటీసీ రాందాస్‌, ఎంపీటీసీలు మల్లన్నపాటిల్‌, సమియొద్దీన్‌, జిన్నారంలో ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌,  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీపీ దేవానంద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి, వైస్‌చైర్మన్‌ నర్సింహాగౌడ్‌, జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌ శివారులో ఎమ్మెల్యే మాణిక్‌రావు, న్యాల్‌కల్‌ మండలంలోని మామిడ్గిలో సర్పంచ్‌ చంద్రన్న, ఝరాసంగంలో నాయకులు నరసింహులు, ప్రకాశ్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  


logo