ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Mar 30, 2020 , 00:20:33

నిత్యావసరాల కొరత లేదు

నిత్యావసరాల కొరత లేదు

  • మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి  తూప్రాన్‌, గజ్వేల్‌లలో పర్యటన 

మెదక్‌ ప్రతినిధి/గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : కరోనా నివారణకు సామాజిక దూరం పాటించడమే సరైన మార్గమని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌యార్డును ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి కొనుగోలుదారులు,వ్యాపారులకు తగిన సూచనలు చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలను పాటిస్తూ ప్రజలందరూ వచ్చేనెల 15 వరకు స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు. నిత్యావసర వస్తువుల కొరత లేదని, కూరగాయలు, ఇతర వస్తువులు అవసరం మేర సరఫరాకు సర్కారు అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ముందుగా కూరగాయలు, మాంసం దుకాణాదారులతో పాటు కొనుగోలుదారులతో మాట్లాడి సూచనలు చేశారు. ఎంపీ వెంట ఫుడ్స్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ భాస్కర్‌, జడ్పీటీసీ మల్లే శం, వైస్‌ చైర్మన్‌ జకీయుద్దీన్‌, నాయకులు మాదాసు శ్రీనివాస్‌, నర్సింగ్‌, మ ద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదేవిధంగా తూప్రాన్‌, మనోహరబాద్‌, కాళ్లకల్‌లో అధికారులు, కౌన్సిలర్లు, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌తో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

జన సమూహం లేకుండా చూడాలి 

  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

రామచంద్రాపురం / అమీన్‌పూర్‌ : మార్కెట్లలో జన సమూహం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్‌లోని సండే మార్కెట్‌, భారతీనగర్‌ డివిజన్‌లోని రైతు బజార్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లల్లో వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా గుర్తులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలందరూ స్వీయనియంత్రణను పాటించి కరోనా వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అమీన్‌పూర్‌ మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

గుమ్మడిదల: మండల కేంద్రంలోని పంచాయతీ కార్మికుడిగా విధులు నిర్వహించిన తమ్మలి సుదర్శన్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం సీజీఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి అంత్యక్రియల కోసం వారి కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. 


logo