సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Mar 27, 2020 , 22:54:36

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలో పరిశ్రమలు

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలో పరిశ్రమలు

  • పూర్తి కావొస్తున్న భూసేకరణ 
  • నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ఉపాధి 
  • సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

ములుగు : కొండపోచమ్మ జలాశయం భూనిర్వాసితుల కోసం నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో గజ్వేల్‌ తరహాలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ములుగు మండలం తునికిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో అధికారులతో కలిసి ఆయన సందర్శించి నిర్వాసితులతో ముచ్చటించారు.నిర్వాసితుల కోసం లైబ్రెరీ, పార్క్‌, ప్లేగ్రౌండ్‌, మహిళా భవనం, యూత్‌ భవనం ఏర్పాటు చేయనున్నామని, లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి సమీపంలోని 419 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. నిర్వాసిత కుటుంబంలో ఒకరికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 1320 కుటుంబాలు తమ గ్రామాలను ఖాళీ చేసి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకున్నారని నేడు మరో 19 కుటుంబాలు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో సామూహిక గృహ ప్రవేశాలు జరుపనున్నట్లు వెల్లడించారు.   


logo