బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Mar 22, 2020 , 23:59:32

కౌన్సిలర్‌ సమీ అరెస్టు

కౌన్సిలర్‌ సమీ అరెస్టు

  • ‘జనతా కర్ఫ్యూపై అనుచిత వ్యాఖ్యలు 
  • నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌, జైలుకు తరలింపు
  • ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు
  • సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి

కంది : జనతా కర్ఫ్యూపై అనుచిత వ్యాఖలు చేసినందుకు సంగారెడ్డి 34 వార్డుకు చెందిన కౌన్సిలర్‌ షమీపై నాన్‌బెలబుల్‌ వారెంట్‌ జారీ చేసి అతడిని అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం సంగారెడ్డి డీఎస్పీ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శనివారం రాత్రి కౌన్సిలర్‌ మహ్మమద్‌ సమీ ఒక వీడియోలో ఎవరూ కర్ఫ్యూ పాటించవద్దని, అందరూ ఇష్టమొచ్చినట్లు బయటకొచ్చి తిరిగి ఎంజాయ్‌ చేయాలని ఓ వర్గం వారిని రెచ్చగొట్టి విధంగా మాట్లాడారు. అది సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. రాత్రి 8 గంటల సమయంలో ఈ వీడియోను షేర్‌ చేయగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా అతడిని హౌజ్‌ అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా ఓ వర్గం వారిని రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించిన సమీపై ఐపీసీ 188తోపాటు 124 (ఎ), 153 (బి), 505 (2) నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సమీని జిల్లా మేజిస్ట్రేట్‌ ముందు హాజరపర్చి జైలుకు పంపించారు. కౌన్సిలర్‌ సమీతోపాటు వీడియోలో ప్రక్కనే ఉన్న షేక్‌ అహ్మద్‌, వీడియో తీసిన మహ్మద్‌ అరఫత్‌పై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే సమీపై గతంలో మతరపరమైన అల్లర్లలో పాల్గొన్న నేర చరిత్ర కూడా ఉదని, ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి సహకరించాలని, ఎవరు కూడా ఇండ్ల నుంచి ఈ నెల 31 వరకు బయటకి రావద్దని ఆయన సూచించారు. 


logo