బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Mar 22, 2020 , 23:55:40

ప్రజలు సహకరించాలి

ప్రజలు సహకరించాలి

  • ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది
  • ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు వాహనాల అనుమతి లేదు
  • ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
  • జాతీయ రహదారిపై చెక్‌పోస్టుల పరిశీలన
  • కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద ఆకస్మిక తనిఖీలు

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: జనతా కర్ఫ్యూ లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని కరోనా వైరస్‌ నివారణకు సహకరించాలని ఎస్సీ  చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జహీరాబాద్‌ సమీపంలోని కర్ణాటక సరిహద్దులో ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. మహారాష్ర్ట, కర్ణాటక వైపు నుంచి లారీలు, ప్రైవేటు టావెల్స్‌ బస్సులు ఇతర వాహనాలను అనుమతి ఇవ్వమన్నారు. ప్రతి ఒక్కరూ ఇండ్లలో ఉండి, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు. సరిహద్దులో ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు చేసి పంపించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.  ముంబయి నుంచి వస్తున్న ప్రైవేటు టావెల్స్‌లో ఉన్న ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి హైదరాబాద్‌కు పంపించామన్నారు. హైదరాబాద్‌ వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జహీరాబాద్‌ ఆర్డీవో  రమేశ్‌బాబు, డీఎస్సీ గణపత్‌ జాదవ్‌, సీఐ. సైదేశ్వర్‌, చెరాగ్‌పల్లి ఎస్‌ఐ. గణేశ్‌, తాసిల్దార్‌ నాగేశ్వర్‌రావు, శ్రీశైలం, కిరణ్‌కుమార్‌, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.

గంగ్వార్‌ చెక్‌పోస్టు వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు 

న్యాల్‌కల్‌: కరోనా వైరస్‌ నివారణ చర్యలో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి రాష్ట్రంలోకి వాహనాలు రాకుండా భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. జనతా కర్ఫ్యూ లో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఆర్‌ డీఎస్పీ అశోక్‌ , జహీరాబాద్‌ రూరల్‌ సీఐ కృష్ణకిశోర్ల ఆధ్వర్యంలో హద్నూర్‌, రాయికోడ్‌, ఝరాసంగం ఎస్‌ఐలు విజయ్‌రావు, గోపి, ఏడుకొండలు, పోలీసు సిబ్బంది, వైద్య, రెవెన్యూ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు, వాహనదారులను వెనుకకు పంపించారు. లారీలను చెక్‌పోస్టు వద్దనే నిలిపివేశారు. ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఏఆర్‌ డీఎస్పీ, రూరల్‌ సీఐల ఆధ్వర్యంలో పోలీసులు, వైద్య సిబ్బంది చప్పట్లను కొట్టి సంఘీభావాన్ని ప్రకటించారు.  logo