శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Mar 19, 2020 , 23:17:45

‘పది’ పరీక్షలు షురూ...

‘పది’ పరీక్షలు షురూ...

  • పరీక్షలు రాసిన 21,995 మంది విద్యార్థులు
  • 53 మంది విద్యార్థుల గైర్హాజరు
  • 41 బృందాలు కేంద్రాల పర్యవేక్షణ
  • హ్యాండ్‌ వాష్‌ చేసుకుని పరీక్షలు రాసిన విద్యార్థులు
  • పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఈవో రాజేశ్‌
  • 33 కేంద్రాలను ఫ్లయింగ్‌ స్కా ్వడ్‌ అధికారుల తనిఖీ

సంగారెడ్డి టౌన్‌ : పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 112 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటిని అందుబాటులో ఉంచారు. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా 22,048 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 21,995 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రెగ్యులర్‌గా 22,038 మంది విద్యార్థులకు 21,990 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రైవేట్‌గా 10 మంది విద్యార్థులకుగాను 5 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 53 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేదు. పరీక్షా కేంద్రాల వద్ద నీటితో చేతులు శుభ్రం చేసుకోవడమే కాకుండా శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలను 41 బృందాలు పర్యవేక్షించాయి. సంగారెడ్డి, చెర్యాల, పోతిరెడ్డిపల్లిలోని 8 పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి పరిశీలించారు. 33 పరీక్షా కేంద్రాలను ప్లెయింగ్‌ స్వాడ్‌ ఆఫీసర్స్‌ తనిఖీలు చేశారు. 

ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు

మునిపల్లి : విద్యార్థి దగ్గర నుంచి ప్రశ్నాపత్రం తీసుకొని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి స్నేహితులకు వాట్సాప్‌ ద్వారా పంపిన విద్యార్థితోపాటు మరో ఇద్దరు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం బుధేరా పోలీస్‌స్టేషన్‌ల్లో బుధేరా ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.  మండలంలోని బుధేరా కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో పది పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నాలుగో గది కిటిలోంచి విద్యార్థి దగ్గర నుంచి తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని సదాశివపేట మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన చాకలి దుర్గాప్రసాద్‌ తన ఫొన్‌లో ఫొటో తీసి.. అదే గ్రామానికి చెందిన గొల్ల రమేశ్‌యాదవ్‌, బుధేరా గ్రామానికి చెందిన కంకోల్‌ శశికాంత్‌రెడ్డిలకు పంపాడు. ఈ విషయమై బుధేరా పరీక్షా కేంద్రం చీఫ్‌ సుపరింటెండెంట్‌ వెంకటేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రశ్నాపత్రాన్ని ఫొటోలు తీసిన ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. మండలంలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు ఉన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. 

అదేవిధంగా పెద్దచెల్మెడ పరీక్షా కేంద్రం వద్ద సైతం గుర్తుతెలియని వ్యక్తులు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసినట్టు సమాచారం. పెద్దచెల్మెడ పరీక్షా కేంద్రంపై సంబంధిత అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు.. అధికారులను కోరుతున్నారు. 

తాజావార్తలు


logo