శుక్రవారం 29 మే 2020
Sangareddy - Mar 19, 2020 , 00:29:19

గంట ముందే రండి

గంట ముందే రండి

  • నేటి నుంచి పది పరీక్షలు
  • దగ్గు, జలుబు ఉంటే ప్రత్యేక గదుల్లో పరీక్ష
  • జిల్లా వ్యాప్తంగా 112 పరీక్ష కేంద్రాలు
  • పరీక్షలు రాయనున్న 22,182 మంది విద్యార్థులు
  • పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రిక్‌ పరికరాలు నిషేధం
  • జిల్లా విద్యాధికారి రాజేశ్‌

పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. బుధవారం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో రాజేష్‌ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే రావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షల కోసం 112 కేంద్రాలు ఏర్పాటు చేశామని, రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 111 కేంద్రాలు, ప్రైవేట్‌ విద్యార్థుల కోసం సంగారెడ్డిలో ఒక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలకు రెగ్యులర్‌ విద్యార్థులు 22,039 మంది, ప్రైవేట్‌గా 143 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.

సంగారెడ్డి టౌన్‌:  పది పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు  19వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహిస్తారు. పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో రాజేశ్‌ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షల కోసం 112 సెంటర్లు ఏర్పాటు చేశామని, రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 111 కేంద్రాలు, ప్రైవేట్‌ విద్యార్థుల కోసం సంగారెడ్డిలో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలకు రెగ్యులర్‌ విద్యార్థులు 22,039 మంది , ప్రైవేట్‌గా 143 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు పంపిణీ చేశామని ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పరీక్షలను అన్ని శాఖల సహకారంతో నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఆర్టీసీ, విద్యుత్‌ శాఖ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, తాగునీటి శాఖ, పోలీసు శాఖల సహకారంతో నిర్వహిస్తున్నామని వివరించారు. 


జిల్లా వ్యాప్తంగా 112 పరీక్షా కేంద్రాలు

జిల్లాలో పది పరీక్షలు నిర్వహించేందుకు 112 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 112 పరీక్షా కేంద్రాలకు 112 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 112 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 1200 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే చికిత్సలు అందించేందుకు సెంటర్‌కు ఒక ఏఎన్‌ఎంను నియమించారు. పరీక్షలకు హాజరయ్యే ఇన్విజిలేటర్లను ఒక రోజు ఒక సెంటర్‌ వస్తే మరుసటి మరో సెంటర్‌ మారనున్నారు. లాటరీ పద్ధతిలో సెంటర్లకు ఇన్విజిలేటర్లను కేటాయించనున్నారు. పరీక్షలకు 5 ైప్లెయింగ్‌ స్వాడ్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. 112 పరీక్షా కేంద్రాల్లో సీ కేటగిరి కింద 11 సెంటర్లను గుర్తించారు. 11 కేంద్రాలు పోలీసు స్టేషన్‌, పోస్టాఫీస్‌లకు 8 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సీ కేటగిరిగా ఎంపిక చేశారు. పరీక్షా పత్రాలను భద్ర పర్చాలంటే దగ్గరలో పోలీసు స్టేషన్‌ ఉండాలి. కానీ 8 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వాటిని సీ కేటగిరి కేంద్రాలుగా గుర్తించి ఆ కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు పరీక్షా ప్రతాలు తీసుకురావడం, తిరిగి వాటిని పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు ఒక వాహనం ఏర్పాటు చేశారు. 

దగ్గు, జలుబు ఉంటే ప్రత్యేక గదుల్లో పరీక్ష

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా పది పరీక్షలు రాసే విద్యార్థులకు జలుబు, దగ్గు వస్తే వారికి పరీక్షలు రాసేందుకు ప్రత్యేక గదులను కేటాయించారు. విద్యార్థులు దగ్గు, జలుబు వస్తే పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు తెలియజేస్తే వారికి కేటాయించిన ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షలు రాయిస్తారు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి వచ్చినా పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు, పెన్నులు, పరీక్షా ప్యాడ్లు, పెన్సిల్‌, జామెట్రి బాక్స్‌లు తెచ్చుకోవాలని డీఈవో రాజేష్‌ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు గూమిగూడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు నిషేధం

పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవ్వరూ కూడా మొబైల్‌ఫోన్లు తీసుకువెళ్లకూడదు. 25 యాక్ట్‌ 97 ప్రకారం పరీక్షాకేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రికల్‌ వాచ్‌లు, డివైస్‌లు నిషేధించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధిస్తారు. నిబంధనలను విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పాటించాలని డీఈవో హెచ్చరించారు. 


logo