శుక్రవారం 29 మే 2020
Sangareddy - Mar 19, 2020 , 00:23:09

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

  • పరీక్షల్లో మొత్తం 8 మంది విద్యార్థుల డిబార్‌
  • ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులు

సంగారెడ్డి టౌన్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్షలు ప్రారంభం నాటి నుంచి 18వ తేదీ వరకు పరీక్షల్లో 8మంది విద్యార్థులపపై మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. బుధవారం ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష కెమిస్ట్రీ, కామర్స్‌ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 13,436 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 12,894 మంది విద్యార్థులు  హాజరయ్యారు. జనరల్‌ కేటగిరిలో 13001 మందికి గాను 12,506 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మరో 495 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ కేటగిరిలో 435 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 388మంది పరీక్షలు రాశారు. వారిలో 47మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. బుధవారం ముగ్గురు విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేశారు. బుధేరా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. డీఐఈవో బృందం 2 పరీక్షా కేంద్రాలు, డీఈసీ మెంబర్స్‌ 6కేంద్రాలు, హెచ్‌పీసీ మెంబర్స్‌ 5 కేంద్రాలు, ైప్లెయింగ్‌ స్వాడ్స్‌ 8 కేంద్రాలు, సిట్టింగ్‌ స్వాడ్స్‌ 4కేంద్రాలు మొత్తం 25 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు సజావుగా ముగిసినట్లు డీఐఈవో కిషన్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 12వ తేదీన జహీరాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో ఒకరు, 13వ తేదీన అదే కళాశాలలో సెకండియర్‌ విద్యార్థి ఒకరు, 16వ తేదీన ద్వితీయ సంవత్సరం టీఎస్‌ఎస్‌డబ్య్లూఆర్‌జేసీ కళాశాల నారాయణఖేడ్‌లో ఒకరు, 18వ తేదీన అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఒకరు, 18న బుధేరా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ముగ్గురు మొత్తం 8 మంది విద్యార్థులు డిబారయ్యారు.

నేటి నుంచి  కళాశాలలు బంద్‌

 గురువారం నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి ఎం.కిషన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రధానాచార్యులు సెలవు రోజుల్లో విద్యార్థులకు ఎంసెట్‌, నీట్‌, ఇతర తరగతులు నిర్వహించరాదని ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కళాశాలలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ఈనెల 31వ తేదీ వరకు కళాశాలలు మూసి ఉంచాలన్నారు.


logo