బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Mar 16, 2020 , 23:10:13

వడివడిగా గోదావరి

వడివడిగా గోదావరి
  • మూడో మోటరు వెట్న్‌ విజయవంతం

బెజ్జంకి : అన్నపూర్ణ(అనంతగిరి) జలాశయంలోకి గోదావరి ప్రవాహం కొనసాగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద నిర్మించిన మహాబావి నుంచి 3వ పంపును సోమవారం సాయంత్రం ప్రారంభించారు. దిగ్విజయంగా అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి మూడు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. మొత్తం నాలుగు పంపులు ఉండగా, ఇప్పటివరకు మూడు పంపుల వెట్న్‌ విజయవంతమైందని కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ ఆనంద్‌ వెల్లడించారు. బుధ, గురువారాల్లో రెండు మోటర్లు, తాజాగా మూడో మోటరు వెట్న్‌ విజయవంతం కావడంతో మిగిలిన రెండో మోటరును ఒకట్రెండు రోజుల్లో రన్‌ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అన్నపూర్ణ జలాశయంలోకి సుమారు 0.68 టీఎంసీల నీరు చేరింది.


logo