శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Mar 15, 2020 , 23:59:51

ముగిసిన ప్రవేశ పరీక్ష

ముగిసిన ప్రవేశ పరీక్ష
  • సజావుగా జరిగిన బీసీ గురుకుల పరీక్షలు
  • సంగారెడ్డిలో మొత్తం 22 పరీక్షా కేంద్రాలు
  • అన్ని కేంద్రాల వద్ద అందుబాటులో వైద్య సేవలు
  • పరీక్షలకు హాజరైన 4,250 మంది విద్యార్థులు
  • 858 విద్యార్థులు గైర్హాజరు

సంగారెడ్డి టౌన్‌: మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల(బీసీ) ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన 22 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాశారు. 5108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా, 4250 మంది పరీక్షలు రాశారు. మరో 858 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. 83.2 శాతం పరీక్షలకు హాజరయ్యారు. 6వ తరగతిలో 2651 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 2353 మంది పరీక్షలు రాశారు. 498 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేదు. 7వ తరగతిలో 1222 మందికి, 1020 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 202 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 8వ తరగతిలో 1035 మందికి, 876 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మరో 159 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేదని చెప్పారు. 

పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్‌ సౌకర్యం..

వేసవిని దృష్టిలో ఉంచుకుని మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల పాఠశాల ప్రవేశపరీక్షలు రా సేందుకు వచ్చే విద్యార్థులకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇ బ్బందులు లేకుండా మెడికల్‌ సౌకర్యం కల్పించారు. 22 పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉం చారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీటి సౌకర్యం క ల్పిం చారు. పరీక్షలను ఆర్‌సీవో ప్రభాకర్‌ పరిశీలించారు.