శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Mar 10, 2020 , 00:22:03

అభివృద్ధి పథకాలకు పుష్కలంగా నిధులు

అభివృద్ధి పథకాలకు పుష్కలంగా నిధులు

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి పథకాలకు విధులు పుష్కలంగా కేటాయించారని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును ఎంపీ బీబీ పాటిల్‌ మర్యాద పూర్వకంగా కలసి సన్మానం చేసి, మాట్లాడారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రజామోద బడ్జెట్‌ ప్రవేశపెట్టారని వివరించారు. సీఎం కేసీఆర్‌  ఆశయం, చిత్తశుద్ధి, పట్టుదలకు అద్దం పడుతుందన్నారు. శాసన సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ కేటాయింపులో కోటి ఎకరాల మాగాణే తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ అందుకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయించారన్నారు. గత ఆరెండ్లలో సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో తెలంగాణ  అంతా సుభిక్షంగా ఉంటుందన్నారు. 


రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయనికి అధిక నిధులు కేటాయించారని, రైతు బంధుతో ఎంతో మంది రైతులకు మేలు కలిగిందన్నారు. గతంలో బడ్జెట్‌లో రైతు బంధుకు రూ.12వేల కోట్లను అదనంగా మరో రూ. 2 వేల కోట్లు పెంచి రూ.14 వేల కోట్లు కేటాయించారన్నారు. రైతులకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించిందన్నారు. రైతులకు బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించి, బడ్జెట్‌లో రూ.1141 కోట్లు కేటాయించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాలు మాఫీ చేసేందుకు బడ్జెట్‌లో రూ.6,225 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసిందన్నారు. వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఆయన కృతజ్ఞతనలు తెలిపారు.


logo