గురువారం 04 జూన్ 2020
Sangareddy - Mar 07, 2020 , 23:48:58

కూలీలకు ‘ఉపాధి’ కల్పించాలి

కూలీలకు ‘ఉపాధి’ కల్పించాలి

జహీరాబాద్‌, నమస్తేతెలంగాణ : జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించాలని జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో, ఉపాధి హామీ జహీరాబాద్‌ ఏపీడీ ఎల్లయ్య తెలిపారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌ మండల ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ ఎల్లయ్య మాట్లాడుతూ వేసవిలో ప్రతి కూలీకి పనులు కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఎక్కడా పనులు లేవు.. అనే ప్రశ్న రావదన్నారు. కొన్ని గ్రామాల్లో పనులు చేసేందుకు కూలీలు సిద్ధంగా ఉన్నా ఉపాధి హామీ సిబ్బంది పనులు చూపించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పనులు చేసేందుకు ప్రతి గ్రామంలో స్థలం గుర్తించి కూలీలకు పనులు కల్పించాలన్నారు.  సమావేశంలో జహీరాబాద్‌, మొగుడంపల్లి ఎంపీడీవో రాములు, శ్రీనివాస్‌రావు, ఏపీవో అశోక్‌కుమార్‌, రంగరావుతోపాటు ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు.


logo