శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Mar 07, 2020 , 05:53:43

సర్కార్‌ దవాఖాన సేవలు భేష్‌

సర్కార్‌ దవాఖాన సేవలు భేష్‌
  • శానిటేషన్‌ మెరుగుపర్చాలి
  • జిల్లా దవాఖానను సందర్శించిన కాయకల్ప బృందం

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా దవాఖానలో వైద్య సేవలు, సౌకర్యాలు బాగున్నాయని కాయకల్ప బృందం సభ్యులు అన్నారు. శుక్రవారం జిల్లా దవాఖానను కాయకల్ప బృందం సభ్యులు సందర్శిచారు. జిల్లా దవాఖానలోని ఓపీ, ఓటీ, బ్లడ్‌బ్యాంక్‌, కార్డియాలజీ, యూరాలజీ, మార్చురీ, మాతా శిశు రక్షణ కేంద్రం, తదితర విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల్లో వివరాలను సేకరించి నమోదు చేసుకున్నారు. జిల్లా దవాఖాన ఆవరణలో పలు చోట్ల శానిటేషన్‌ అధ్వానంగా ఉన్నదని, శానిటేషన్‌ మెరుగుపర్చాలని సూచించారు. డాక్టర్లు ఆప్రాన్స్‌ వేసుకోకపోవడంపై కాయకల్ప బృందం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా దవాఖాన, ఎంసీహెచ్‌లో సేవలు, సౌకర్యాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం పీవో డాక్టర్‌, అశోక్‌కుమార్‌, యూనిసెఫ్‌ కన్సల్టెంట్‌ రవి నాయుడు, టీవీవీపీ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ విజయ్‌ సందీప్‌, ఖమ్మం జిల్లా దవాఖాన స్టాఫ్‌ నర్సు మేరీ, డీక్యూఏఎం రిజ్వాన్‌ అలీ, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 


logo