శుక్రవారం 29 మే 2020
Sangareddy - Mar 05, 2020 , 23:21:54

ఆర్టీఏలో అన్‌లిమిటెడ్‌ ఆఫర్‌

ఆర్టీఏలో అన్‌లిమిటెడ్‌ ఆఫర్‌

కంది : సుప్రీం కోర్టు సూచనల మేరకు ఈ నెల 31 వరకు అన్ని కొత్త బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రకియ పూర్తి చేసేలా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వారిని గుర్తించి వారికి మెసేజ్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో గురువారం కంది మండల పరిధిలోని ఆర్టీఏ కార్యాలయంలో వాహనదారులు పెద్దసంఖ్యలో రిజిస్ట్రేషన్‌ కోసం బారులు తీరారు. అందరికీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా ఆర్టీఏ అధికారులు సాధారణ పని వేలల కంటే ఎక్కువ సమయం వరకు కార్యాలయంలో ఉండి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 115 వాహనాల రిజిస్ట్రేషన్‌లను అధికారులు పూర్తి చేశారు.


ముందస్తు బుకింగ్‌కు అపరమిత స్లాట్లు

వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కోసం ముందస్తు బుకింగ్‌ చేసుకునేలా ప్రత్యేకంగా అపరిమిత స్లాట్‌లను గతం లో ఉండేవి. కానీ ఈ స్లాట్‌ల సంఖ్య పరిమితిలో ఉండగా, ప్రస్తుతం ఆ స్లాట్‌లను అపరిమితానికి పెంచారు ఆర్టీఏ అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా తమ రిజిస్ట్రేషన్‌ తేదీని ఆ స్లాట్‌లో బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఫలానా రోజున రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌లో ముం దస్తుగా తమ పేర బుకింగ్‌ను చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పరిమితి సంఖ్యలో ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే గతంలో అవకాశం ఉండగా, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తూ స్లాట్‌ల సంఖ్య అపరిమితాని పెంచారు. ఈ సందర్భంగా ఆర్టీఏ అధికారులు మాట్లాడుతూ కొత్తగా కొన్న వాహనాలకు ఇంకా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వారు వెంటనే తమ వాహానికి సంబధించిన రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకోవాలని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఎంత మంది వచ్చినా తాము రిజిస్ట్రేషన్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఎక్కువ పని వేళలను పొడిగించి మరీ రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేస్తామని ఉప రవాణా కమిషనర్‌ శివలింగయ్య తెలియజేశారు.


logo