సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Mar 05, 2020 , 00:18:03

ఘనంగా భ్రమరాంబ మల్లికార్జున కల్యాణం

ఘనంగా భ్రమరాంబ మల్లికార్జున కల్యాణం

మునిపల్లి : మునిపల్లి మండలం మల్లికార్జునపల్లి గ్రామంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం బుధవారం  వైభవంగా కొనసాగింది. ఈకార్యక్రమానికి మాధవానంద సరస్వతి స్వామీజీ హాజరై కల్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దైవచింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. అంతకుముందు మల్లికార్జునపల్లి గ్రామ శివారులోని పాత శివాలయం నుంచి గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జునస్వామి దేవాలయం వరకు పల్లకీసేవ నిర్వహించి దేవతామూర్థుల విగ్రహాలను ఊరేగించారు. ఉత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


 హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే 

 భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్‌ పాల్గొని  పూజలు చేశారు. అనంతరం మాధవానంద సరస్వతిస్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గడిల నవాజ్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, మునిపల్లి ఎంపీపీ శైలజ శివకుమార్‌, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సతీశ్‌కుమార్‌, ఎంపీటీసీ ఉల్లిగడ్డల శివకుమార్‌, డైరెక్టర్‌ వెంకట్‌రాములు, సర్పంచ్‌ విమలమ్మ తదితరులు పాల్గొన్నారు. 


logo