గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Mar 04, 2020 , 01:01:21

వివాహ రిజిస్ట్రేషన్‌ నమోదు తప్పని సరి

వివాహ రిజిస్ట్రేషన్‌ నమోదు తప్పని సరి

న్యాల్‌కల్‌: వివాహ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులను జారీ చేసింది. మండలంలోని గ్రామాల్లో అన్ని పంచాయతీల్లోనూ పేర్ల నమోదు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు గాను  పంచాయతీ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేశారు. వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 చెల్లిస్తే అధికారులు మీ ఇంటికి వచ్చి కార్యక్రమం పూర్తి చేస్తారు. మండలంలోని 37 పంచాయతీల్లో రిజిస్ట్రేషన్‌ నమోదు చేస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్‌ వల్ల వివాహానికి చట్టబద్ధత ఉండడమే కాకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఆర్థిక సహా యం, భర్త చనిపోతే వితంతు పింఛన్‌, భర్త నుంచి విడిపోతే భరణం పొందేందుకు అవకాశం ఉంటుంది, బాల్య వివాహాల నిర్మూలన, రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది వరకు వివాహ రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో అనేక ఇబ్బందులకు గురికాల్సిన పరిస్థితి ఉండేది. ప్రతి ఏడాది వందల సంఖ్యలో వివాహాలు జరిగేవి. అయినా రిజిస్ట్రేషన్‌ అయ్యేవి కావు. వివాహ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు వివాహ నమోదు చేసుకుంటున్నారు.

పంచాయతీ కార్యాలయంలో వివాహ నమోదు

పెండ్లి జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోగా గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దీని కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 30రోజుల నుంచి 60 రోజుల్లోపు నమోదు చేసుకుంటే రూ.100 రుసుం చెల్లించాల్సి ఉంటుం ది. మూడు నెలలు దాటిటే రూ.1,000 చెల్లించాల్సి ఉంటుం ది. రూ.500 చెల్లిస్తే అధికారులు మీ ఇంటికి వచ్చి వివాహ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపడుతారు. గతంలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండడంతో ఒక్కొక్కరికీ మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను చేపట్టారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పంచాయతీలన్నింటికీ కార్యదర్శులను ఉండాలనే నిబంధన ఉండడంతో అన్ని పంచాయతీలకు పూర్తిస్థాయిలో కార్యదర్శులను నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి అందుబాటులో ఉండడంతో ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్‌ నమోదు తప్పని సరి చేసింది.

వివాహ రిజిస్ట్రేషన్‌తో అనేక ఉపయోగాలు

వివాహానికి చట్టబద్ధత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఆర్థిక సహాయం, భర్త చనిపోతే వితంతు పింఛన్‌, భర్త నుంచి విడిపోయే సందర్భాల్లో  భరణం పొందేందుకు అవకాశం ఉంటుంది, బాల్య వివాహాల నిర్మూలన, రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రేమ పేరిట మోసాలు, రహస్య పెండ్లిలు, రుజువులేని వివాహాల రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారికి భార్యాభర్తలుగా పరిగణించబడుతారు.


logo