సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Mar 04, 2020 , 01:01:21

ప్రజలకు అందుబాటులో రెవెన్యూ సేవలు

ప్రజలకు అందుబాటులో రెవెన్యూ సేవలు

కొండాపూర్‌ : ప్రజలకు అందుబాటులో రెవెన్యూ సేవలు కొనసాగించాలని అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రం కొండాపూర్‌లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సేవలు ప్రజలకు దగ్గర చేసేందుకు ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రెవెన్యూ అధికారులు పార్ట్‌-బీలో మిగిలిపోయిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పనులు సత్వరమే చేసేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జిదారు చెప్పిన సమస్యలను పూర్తిగా విన్న తర్వాతనే రికార్డులు సరి చూసుకోవాలన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ భూములు గుర్తించేందుకు గంగారం, కొండాపూరం, మునిదేవునిపల్లి, మల్కాపూర్‌ గ్రామాల్లోని పలు సర్వే నెంబర్లలోని సమస్యలను ఈ నెల 10వ తేదీ లోగా సర్వేయర్లు సర్వేలు పూర్తి చేసి తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రెవెన్యూ అధికారులు అవినితీ ఆరోపణలు ఎదుర్కొంటే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ బలరాముడు, ఉప తాసిల్దార్‌ సతీశ్‌, ఆర్‌ఐలు, వీఆర్వోలు పాల్గొన్నారు. 


logo