శుక్రవారం 05 జూన్ 2020
Sangareddy - Feb 28, 2020 , 01:14:39

గోవాలో డైరెక్టర్లు

గోవాలో డైరెక్టర్లు
  • 25 మంది డైరెక్టర్లు అక్కడే..
  • రేపు నేరుగా ఎన్నిక కేంద్రం వద్దకు
  • వారితో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి 18మంది డీసీసీబీ, డీసీఎంఎస్‌కు 7మంది డైరెక్టర్లు గురువారం గోవా టూర్‌ వెళ్లారు. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ డైరెక్టర్లతో కలిసి ఉన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పేర్లను సీఎం కేసీఆర్‌ ఖరారు చేయనున్నారు. ఈ నెల 29న ఉదయం డైరెక్టర్లందరూ సంగారెడ్డిలోని డీసీసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఉదయం నామినేషన్ల స్వీకరించి, మధ్యా హ్నం తర్వాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు చిట్టి దేవేందర్‌రెడ్డి, మహరెడ్డి దేవేందర్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, మ ల్కాపురం శివకుమార్‌, అంజిరెడ్డిలతోపాటు మిగతా డైరెక్టర్లు గోవా యాత్రలో ఉన్నారు.


logo