మంగళవారం 02 జూన్ 2020
Sangareddy - Feb 24, 2020 , 00:33:36

నయనానందం రథోత్సవం

నయనానందం రథోత్సవం
  • నెలవారీగా 20 నుంచి 30 వరకు పెంపు
  • ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు అమలు
  • 100 క్యూబిక్‌ మీటర్‌కు రూ.120 చెల్లింపు
  • 80,421 కుటుంబాలకు లబ్ధి

పాపన్నపేట : విద్యుత్‌ కాంతుల దగదగల మధ్య దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల గుట్టలు ఆదివారం రాత్రి ప్రజ్వరిల్లాయి. భక్తుల కోలాహలం కేరింతల మధ్య రథోత్సవం కనుల పండువగా కొనసాగింది. ఈ రథోత్సవ ప్రారంభోత్సవ కార్యాక్రమంలో ఆలయ ఈవో సార శ్రీనివాస్‌, ఉత్సవ కమిటీ సభ్యులు బాలాగౌడ్‌, సాయిరెడ్డి, దుర్గయ్య, వీరేశంలు పాల్గొనగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నాగ్సాన్‌పల్లికి చెందిన పెద్దకాపు రథోత్సవ కార్యక్రమానికి హాజరు కాగా భక్తజనం దుర్గామాత నామస్మరణ చేస్తూ రథంగోళి నుంచి అమ్మవారి ఆలయం వరకు రథాన్ని లాగే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలకు చెందిన లక్షలాది మంది తిలకించారు. 


రథం కదిలిన తీరు ఇలా.. 

నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన పెద్ద కాపు గంగారెడ్డి ఇంటికి వెళ్లి రథోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి తీసుకురాగా ఆయన వెంట 18 మంది పనిబాటలు వారు ఏడుపాయలకు చేరుకొని రథం గోళి వద్ద రథం ముందు పట్టుపరిచి రకరకాల ముగ్గులు వేసి పూజలు నిర్వహించి రథం లాగే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


పకడ్బందీ ఏర్పాట్లు 

జాతర ఏర్పాట్లపై ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, జిల్లాస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, అదనపు అడిషనల్‌ ఎస్పీ నాగరాజు జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలీసులు సైతం 950 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. మంజీరానదీ ప్రాంతంలో అవసరమైన మేర గజ ఈతగాళ్లను నియమించారు.    సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. 


దుర్గామాతను దర్శించుకున్న మాధవానందస్వామి 

తొగిట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆదివారం వేకువజామునే దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట ఈవో సార శ్రీనివాస్‌, ఉత్సవ కమిటీ సభ్యులు సాయిరెడ్డి, దుర్గయ్య, బాలాగౌడ్‌, వీరేశం ఉన్నారు. 


బోనం సమర్పించిన జోగిని శ్యామల 

ఏడుపాయల దుర్గాభవానీ మాతకు శనివారం రాత్రి జోగిని శ్యామల దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఏడుపాయలలో పురవీధుల గుండా బోనమెత్తి నృత్యం చేసిన తీరు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నది.  


నేడు హుండీ లెక్కింపు

ఏడుపాయల వనదుర్గాదేవి మహాజాతర హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో సార శ్రీనివాస్‌ వెల్లడించారు. సోమవారం ఉదయం గోకుల్‌ షెడ్‌లో భవానీమాత, సత్యసాయి సేవాసమితి, భక్తులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. 


logo