శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Feb 22, 2020 , T01:05

పర్యాటక కేంద్రంగా.. ఏడుపాయల

పర్యాటక కేంద్రంగా.. ఏడుపాయల

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వచ్చే సంవత్సరం నిర్వహించే ఏడుపాయల వనదుర్గాభవానీ జాతర వరకు ‘కాళేశ్వరం’ నీరు ఘనపురం ప్రాజెక్టుకు చేరుతుందని, ఆ నీటితో వచ్చే మహాశివరాత్రి జాతరలో అమ్మవారి పాదాలు కడుగుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఏడుపాయల వనదుర్గాభవానీ జాతరకు మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీ ప్రసాద్‌, కలెక్టర్‌ ధర్మారెడ్డి, జేసీ నగేశ్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డిలతో కలిసి జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యే క పూజలు చేశారు. మంత్రికి పూర్ణకుంభంతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే శివరాత్రి వరకు ‘కాళేశ్వరం’ నీటితో అమ్మవారి పాదాలు కడుగుతామన్నారు. వచ్చే సంవత్సరానికి ‘కాళేశ్వరం’ నీరు సింగూరుకు వస్తుందని, సింగూర్‌ నుంచి ఘనపూ ర్‌ ఆనకట్టకు నీరు చేరుతుందని దీంతో ఈ ప్రాంతంలో రెండు పంటలకు సరిపడా నీరు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక ఏడుపాయలలో తాత్కాలిక పనులు కాకుండా, శాశ్వత పనులకు శ్రీకారం చుడుతామన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఏడుపాయల అభివృద్ధికి చర్యలు చేపడుతామన్నారు. ఏడుపాయల్లో అటవీ భూమి సేకరణ కార్యక్రమం చేపట్టామని, అలాగే ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ వేములవాడ, యాదాద్రి, కూడవెల్లి, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నూతనంగా ఏర్పాటైన పోతంశెట్టిపల్లి రోడ్డు నుంచి ఏడుపాయల వరకు బీటీ రోడ్డును ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణ కోసం రూ.75లక్షలు మంజూరు చేసిందన్నారు. ఏడుపాయల జాతరకు జిల్లా యంత్రాంగం 15 రోజుల్లో అన్ని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేశారని ఆయన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనేక ఆలయాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. నిరంతరం భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించడం జరిగిందన్నారు. ఇందు లో భాగంగానే దేవాలయం చుట్టూ ఉన్న అటవీ భూములను దేవాదాయ శాఖ అధీనంలోకి తీ సుకునేందుకు గాను అంతే మొత్తంలో స్థలాన్ని అటవీశాఖకు అప్పగించేందుకు పరస్పర అంగీకారం జరిగినట్లు మంత్రి వివరించారు. ఈ భూ ములను తీసుకున్న అనంతరం భక్తుల సౌకర్యా ర్థం కాటేజీల నిర్మాణం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాల్‌ ధ్యాన మంది రం, మరుగుదొడ్లు, మూత్రశాలల వంటి అనేక నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఘనపురం ప్రాజెక్టు ఆధునీకరణ ఎత్తు పెంపునకు  ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎత్తు పెంపుతో పాటు కాల్వల ఆధునీకరణకు నిధులు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘కాళేశ్వరం’ నీరు ద్వారా ఈ ప్రాంత రైతులు వర్షాలతో సంబంధం లేకుండా రెండు పంటలు పండించే వెసులుబాటు కలుగుతుందన్నారు. అనంతరం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శనను మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలతో ప్రారంభించారు. ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌ పాల్గొన్నారు.