సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Feb 21, 2020 , 06:04:38

హర హర మహదేవ....

హర హర మహదేవ....

సంగారెడ్డి మున్సిపాలిటీ: మహా శివరాత్రికి ఆలయాలు ముస్తాబయ్యాయి. రాజంపేటలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహారుద్ర స్వహకార సహిత చండీయాగం ఆలయ ప్రధాన అర్చకులు కేసరినాథ్‌జోషి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. రెండు రోజుల నుంచి వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటలకు ధ్వజారోహణం, గణపతిపూజ, 5.30 గంటల నుంచి సాయం త్రం 5.00 గంటల వరకు అభిషేకాలు, రాత్రి 9 గంలకు పల్లకీసేవ రాత్రి 10.00 గంటల నుంచి భజనా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకుడు కేసరినాథ్‌ జోషి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 


కల్పగూర్‌లో..

మండలంలోని కల్పగూర్‌ గల కాశీవిశ్వేశ్వర ఆలయాన్ని అం దంగా ముస్తాబు చేశారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. కాశీవిశ్వేశ్వర దేవస్థానం అతి పురాతనమైంది కాకతీయ మహారాజులు ఆలయా న్ని నిర్మించారు. వరంగల్‌లోని 1000 స్తంభాలగుడి శిల్పకళ కలిగి ఉంటుంది.  భక్తులు కోరిన కోర్కెలు తీర్చే త్రిమూర్తులు ఇక్కడ ఉన్నారు.  ఆలయంలో నేడు ఉద యం 5గంటలకు ద్వజారోహ ణం, గణపతిపూజ, 5.15 గంటల నుంచి సాయ త్రం 5గంటల వరకు అభిషేకాలు, రాత్రి 7గంటలకు పల్లకీ సేవ, 8గంటలకు భజన కార్యక్రమాలు, అనంతరం లింగోద్భవ సమయంలో మహారుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కటా క్షం పొందాలని కాశీవిశ్వేశ్వర దేవస్థానం సభ్యులు కోరారు. 


సంగారెడ్డిలో...

సంగారెడ్డి పాత బస్టాండ్‌ వద్ద గల సంగమేశ్వరాలయం, సోమేశ్వరవాడలోని సోమేశ్వరాలయం, పోతిరెడ్డిపల్లిలోని శివాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండాఅన్ని ఏర్పాట్లు చేశా రు. శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. పండగ సందర్భంగా పట్ట ణ ప్రధాన రహదారికి ఇరువైపులా పెద్దఎత్తున పండ్ల దుకాణాలను ఏర్పాటు చేశారు. అలాగే, పాత బస్టాండ్‌, కొత్త బస్టాండు బైపాస్‌ రోడ్డు, పోతిరెడ్డిపల్లిలో కూడా పండ్ల దుకాణాలను ఏర్పా టు చేశారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వారు ముందుగానే పండ్లను కొనేందుకు మార్కెట్‌కు తరలివచ్చి సందడి చేశారు. logo