గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Feb 21, 2020 , 06:02:43

పల్లెల ప్రగతి భవిష్యత్‌ తరాలకు నాంది

పల్లెల ప్రగతి భవిష్యత్‌ తరాలకు నాంది

అమీన్‌పూర్‌ : పల్లెల ప్రగతి భవిష్యత్తు తరాలకు నాంది అని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని వడక్‌పల్లి, జానకంపేట, ఐలాపూర్‌, ఐలాపూర్‌ తండా, దయారాలలోఎమ్మెల్యే సొంత నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లను   పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పల్లెల్లో ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని, ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో చిన్న స్థాయి గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య ఉత్పన్నం కావడంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తన సొంత నిధులతో ట్రాక్టర్లను పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ట్రాక్టర్లను సర్పంచ్‌లు, పాలక మండలి సభ్యులకు అందజేశారు. 


జడ్పీ చైర్మన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి రాథోడ్‌, ఎంపీపీ దేవానంద్‌, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి, ఎంపీడీవో మల్లేశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ నరసింహాగౌడ్‌, సర్పంచ్‌లు పాండు యాదవ్‌, లలితా మల్లేష్‌, భాస్కర్‌ గౌడ్‌, నర్సమ్మ, నితీషా శ్రీకాంత్‌, ఏర్పుల కృష్ణ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు సునీత సత్యనారాయణ, కౌన్సిలర్లు కృష్ణ, రాజు, ఉప తహసీల్దార్‌ రాములు పాల్గొన్నారు. logo