సోమవారం 26 అక్టోబర్ 2020
Sangareddy - Feb 20, 2020 , 01:37:26

అంగన్‌వాడీ వ్యవస్థను పటిష్టం చేయాలి

అంగన్‌వాడీ వ్యవస్థను పటిష్టం చేయాలి
  • - కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి చౌరస్తా: అంగన్‌ వాడీ వ్యవస్థను పటిష్టం చేయాలని కలెక్టర్‌  హనుమంతరావు అంగన్‌వాడీ టీచర్లకు పిలుపునిచ్చారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో అంగన్‌వాడీ టీచర్ల పూర్వ ప్రాథమిక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. పిల్లలకు ప్రాథమిక విద్య అంగన్‌వాడీ కేంద్రాల నుంచే ప్రారంభమవుతున్నదని గుర్తు చేశారు. అందుకే ప్రాథమిక విద్య పకడ్బందీగా ఉండాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. అంగన్‌వాడీల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతున్నదని, కనిసం 30 మంది పిల్లలు విధిగా ఉండాలని, వారి హాజరు శాతం 100 ఉండాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమయ పాలన పాటించాలన్నారు. పేద పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు వరమని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రతి చిన్నారిని తమ కేంద్రంలో చేరేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారి ఉన్నారని, వారి తనిఖీల్లో ఎవరు విధుల్లో లేకపోయినా శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ పద్మావతి, సీడీపీవోలు స్వప్న, రేణుక, లక్ష్మీబాయి, డీసీపీవో రత్నం, అజీం ప్రేమ్‌జీ సంస్థ రాష్ట్ర ఇన్‌చార్జి శ్రీనివాసులు, జిల్లా ఇన్‌చార్జి ఉమా మహేశ్వర్‌రావు, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.


logo