సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Feb 18, 2020 , 01:20:57

సీఎం కేసీఆర్‌కు ‘నమస్తే’ కానుక

సీఎం కేసీఆర్‌కు   ‘నమస్తే’ కానుక

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక బాధ్యతగా ‘నమస్తే తెలంగాణ’ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టింది. మంత్రి నుంచి ఎంపీ,ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్‌, ఇతర అధికారులు, విద్యార్ధులు, అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  • నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో హరిత ఉద్యమం
  • నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
  • గుమ్మడిదలలో మొక్క నాటిన మంత్రి సత్యవతిరాథోడ్‌
  • మొక్కలు నాటిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు
  • ఉత్సాహంగా పాల్గొన్న నమస్తే తెలంగాణ ప్రతినిధులు

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని సామాజిక బాధ్యతగా ‘నమస్తే తెలంగాణ’ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టింది. మంత్రి నుంచి ఎంపీ,ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్‌, ఇతర అధికారులు, విద్యార్ధులు, అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమస్తేతెలంగాణ చేపట్టిన మంచి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.

- సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ


సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టింది. మంత్రి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, ఇతర అధికారులు, విద్యార్థులు, అన్నివర్గాల  ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ చేపట్టిన మంచి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి సత్యవతిరాథోడ్‌ బొంతపల్లిలోని వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలునాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్క నాటి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్సీపురం ఈఎస్‌ఐ దవాఖాన ఆవరణంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, భారతీనగర్‌ కార్పొరేటర్‌ సిందూఆదర్శరెడ్డి మొక్కలు నాటారు. జహీరాబాద్‌లో ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.


నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నమస్తే సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఆవరణంలో కలెక్టర్‌ హనుమంతరావు మొక్కలు నాటారు. జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ సంగారెడ్డి, వైద్య సిబ్బంది, నమస్తే తెలంగాణ ప్రతినిధులు పాల్గొన్నారు.  మండల కేంద్రాలు,  గ్రామాల్లో పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో మొక్క లు నాటే కార్యక్రమాలు జరిగాయి. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా జైలులో కూడా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. జైలర్‌ శివకుమార్‌గౌడ్‌, జైలు సిబ్బంది నమస్తే తెలంగాణ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా దవాఖానలో మొక్కలు నాటిన తర్వాత కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడారు. సామాజిక బాధ్యతగా నమస్తే తెలంగాణ యాజమాన్యం మొక్కలు నాటే మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.


logo