సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Feb 16, 2020 , 23:36:49

ముగిసిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

ముగిసిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • 5 సొసైటీల్లో 3 టీఆర్‌ఎస్‌, 2 కాంగ్రెస్‌ మద్దతుదారులు
  • 2 సొసైటీల ఎన్నిక వాయిదా

కొండాపూర్‌: వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. కొండాపూర్‌ మండలంలో 5 సొసైటీలు ఉండగా  అందులో 3 సొసైటీలను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కైవసం చేసుకోగా, 2 సొసైటీలను కాంగ్రెస్‌ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. మారేపల్లి సొసైటీలో బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక జరిగింది. మొత్తం 12ఓట్లు నమోదు కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 12ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థికి 3 ఓట్లు వచ్చాయి. గొల్లపల్లి సొసైటీ చైర్మన్‌ లోకరెడ్డిగారి శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా పి. శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే కొండాపూర్‌ చైర్మన్‌గా ఎం.మాణిక్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా బలవంత్‌రెడ్డి, మల్కాపూర్‌ సొసైటీ చైర్మన్‌గా పవన్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌గా మాణిక్యరెడ్డి, అలాగే మారేపల్లి సొసైటీ చైర్మన్‌గా మున్నూరు రాజు, వైస్‌ చైర్మన్‌గా రాములు ఎన్నికయ్యారు. తేర్పొల్‌ సొసైటీ చైర్మన్‌గా నరసింహారావు దేశ్‌పాండే, వైస్‌ చైర్మన్‌గా రాంరెడ్డిలు ఎన్నికయ్యారు. సహకార సంఘం చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు కొండాపూర్‌ మండలంలో ప్రశాంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లేశం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

సంగారెడ్డి రూరల్‌: సహకార ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఆఫీస్‌ బేరర్ల సమావేశం వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారులు బాబూనాయక్‌, గణేశ్‌ తెలిపారు. ఆదివారం సంగారెడ్డి మండల పరిధిలో ఇస్మాయిల్‌ఖాన్‌పేట, నాగాఫూర్‌ రెండు సొసైటీ సంఘాల్లో ఎన్నికైన వారిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు  సరిపడా కోరం సభ్యులు లేనందున సమావేశాన్ని వాయిదా  వేశామని అధికారులు తెలిపారు. 


logo