గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Feb 16, 2020 , 23:25:30

కుర్రకారు హుషారు

కుర్రకారు హుషారు

సంగారెడ్డి టౌన్‌: ఎలాన్‌ ఎన్‌ విజన్‌ వేడుకలు జోష్‌ఫుల్‌గా ముగిశాయి. ఆదివారం చివరి రోజున కుర్రకారు హుషారెత్తించారు. తమ ఆట పాటలతో అందరినీ అలరింపజేశారు. ఐఐటీ హైదరరాబాద్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన స్టాండింగ్‌ కామెడీ విద్యార్థులను కడుపుబ్బా నవ్వింపజేసింది. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమదైన హాస్యశైలీతో ఆడిటోరియంలో నవ్వులు పూయించాయి. అలాగే ఐఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రోన్‌ గేమింగ్‌ సెట్‌లో విద్యార్థులు తమ డ్రోన్‌ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. అలాగే వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఉత్తమ ప్రతిభ చాటిన వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఉదయం రాప్‌ బ్యాటిల్‌, ఎథికల్‌ హ్యాకింగ్‌ వర్క్‌ షాపు, ఫైతాన్‌ ప్రోగ్రామింగ్‌, ఆర్గనైజర్స్‌ రూం, ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, అల్‌గోర్‌థిమా, డ్రిప్ట్‌ కింగ్‌, డీటీఎంఎఫ్‌ రేస్‌, బ్రిడ్జి బిల్గింగ్‌, రోబోటిక్‌ గేమింగ్‌ విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. 


మధ్యాహ్నం నుంచి క్యాంపస్‌ ఐడేల్‌, క్యాపర్స్‌ ప్లాగ్‌, షార్క్‌ ట్యాంక్‌, ఎలక్ట్రిక్‌ బజ్‌, డీపన్‌, అక్వానల్ట్‌, న్యాకుడ్‌ నాటక్‌, డ్యాన్స్‌ వర్క్‌షాపులను నిర్వహించారు. రాత్రి స్ట్రీట్‌ బ్యాటిల్‌, వెన్‌ చాయ్‌ మెట్‌ టోస్టు రేవ్‌ పబ్లిక్‌ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా పలు కళాశాలలకు చెందిన బ్యాండ్‌ బృందాలు తమ ప్రతిభను చాటుకున్నారు. ఐఐటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లు, ప్రదర్శనల వద్ద విద్యార్థులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆట, పాటలతో ప్రాంగణంలో హోరెత్తించారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎలాన్‌ వేడుకలకు దేశవ్యాప్తంగా ఐఐటీయన్లతో పాటు ఇతర ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాల్గొని  సందడి చేశారు. కొత్త ఆలోచనలు, కొత్త పరిశోధనలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అందరినీ ఒకచోట చేర్చిన ఈ ఈవెంట్‌లో విద్యార్థులు ఒకరితో ఒకరు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి యేటా ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు అన్నీ తామై నిర్వహించే ఈ ఫెస్ట్‌లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈవెంట్‌ను ఇంత అద్భుతంగా చేసిన విద్యార్థుల శ్రమను ప్రొఫెసర్లతో పాటు ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ యుబీ దేశాయ్‌ ప్రత్యేకంగా అభినందించారు.


logo