శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Feb 15, 2020 , 23:40:06

చిరధాన్యాల సాగును ప్రోత్సహించాలి

చిరధాన్యాల సాగును ప్రోత్సహించాలి
  • రసాయన ఎరువుల సాగుతో నష్టం
  • ముగిసిన పాత పంటల జాతర
  • కలెక్టర్‌ హనుమంతరావు
  • సేంద్రియ వ్యవసాయం చేయాలి

ఝరాసంగం: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శనివా రం మండల పరిధిలోని మాచూనూర్‌ గ్రామ శివారులో పచ్చసాలేలో జరిగిన 20వ పాత పంటల జాతర ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొ సైటీ ఆధ్వర్యంలో పండిస్తున్న చిరుధాన్యాలు దేశానికే ఆదర్శమన్నారు. మహిళా రైతులు చిరుధాన్యాలు సాగుచేసేందుకు ముందుకు రావడం సం తోషంగా ఉందని చెప్పారు. రైతులు విత్తనాలు నిల్వ చేసుకుని సాగుచేయడంతో నష్టం ఉండదన్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలని సూచించారు. సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. సేంద్రియ ఎరువులతో సాగు చేయడంతో భూమికి ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. చిరుధాన్యాలను సేంద్రియ ఎరువులతో సాగు చేయడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. డీడీఎస్‌ సంస్థలో చిరుధాన్యాలు పండించే మహిళా రైతులు ఎంతో గొప్ప శాస్త్రవేత్తలంటూ వారిని అభినందించారు. వర్షాకాలం పూర్వవైభవం రావాలంటే  వృక్షజాతి సం పద కావాలన్నారు.


నాటిన ప్రతిమొక్కను సంరక్షించినప్పడే సీఎం కేసీఆర్‌ కల నెరవేరి బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఉన్నత వర్గాల వారు సూపర్‌ మార్కెట్‌ల్లో  చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. చిరుధాన్యాలకు ఎంతో డిమాండ్‌ పెరిగిందన్నారు. మార్కెట్లో ఎక్కువ ధరకు చిరుధాన్యాలు అమ్ముడు పోతున్నాయన్నారు. మీలాంటి మహిళా రైతులకు ప్రభు త్వం అండగా నిలుస్తుందన్నారు. డీడీఎస్‌ సంస్థ వారు జహీరాబాద్‌ ఎజెండాను కలెక్టర్‌ విడుదల చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఏ విధంగా ముం దుకు సాగుతుందో జహీరాబాద్‌ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.


జీవవైవిధ్య అనుభవజ్ఞులకు సన్మానం

చిరుధాన్యాలు సాగుచేసిన మహిళా రైతులను పాత పంటల జాతరలో సన్మానించారు. జీవవైవిధ్య పంటలు సాగుచేస్తున్న హుమ్నాపూర్‌ గ్రా మానికి చెందిన రత్నమ్మను కలెక్టర్‌  హనుమంతరావు సన్మానించారు. అల్గొలో గ్రామానికి చెం దిన రత్నమ్మను డాక్టర్‌ సంజయ్‌ బర్తూర్‌ సన్మానించారు. పస్తాపూర్‌ గ్రామానికి చెందిన నర్సమ్మను  రామాచారి సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ రుక్మిణిరావు డైరెక్టర్‌ రిసోర్స్‌ సెం టర్‌ ఉమెన్‌,  డీడీఎస్‌ జయశ్రీ కో-డైరెక్టర్‌, ప్రతినిధులు నాయ్‌కుమార్‌, తుకారాం, బాలయ్య, చంద్రమ్మ, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

రసాయన ఎరువుల పంటలతో వ్యాధులు అధికం 

రసాయన ఎరువులతో సాగుచేసిన ఆహారంగా తీసుకోవడంతో అధిక రోగాలు వస్తాయి. సేంద్రియ ఎరువులతో సాగు చేసిన ఆహారం తీసుకోవాలి.  ఇంట్లో సేంద్రియ ఎరువులతో తయారు చేసిన వం టలు చేసేందుకు ఆసక్తి చూపాలి. చిరుధాన్యాల సాగుచేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రకృతిపరంగా పండే పం టలను సాగుచేయాలి. వర్షాధారం అంతర పంటలు సాగుచేసేందుకు రైతులు ముం దుకు రావాలి. వ్యవసాయశాఖ తరఫున రైతులను ఆదుకుంటాం. 

-ఆశీష్‌ కొఠారి, పర్యావరణవేత్త 

ఎడ్ల బండ్లను ప్రోత్సహించాలి

ప్రభుత్వం ఎడ్ల బండ్లను కొనుగోలు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి. గ్రామా ల్లో పశువులు లేక రైతులు యంత్రాలతో వ్యవసాయ పనులు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేయాలంటే పశువులు తప్పకుండా ఉండాలి.  20ఏం డ్లుగా పాతపంటల జాతర నిర్వహిస్తున్నాం. జాతరలో దేవుళ్లకు పూజలు లేవని, ఎడ్ల బండ్లు, విత్తనాలకు పూజలు చేస్తాం. దేశ విదేశాల వారు పాత పంటల జాతరకు వస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలి. రసాయన ఎరువుల సాగు పెరిగింది.  

- డీడీఎస్‌ డైరెక్టర్‌  పీవీ సతీశ్‌