మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Feb 15, 2020 , 23:38:39

ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు

ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు
  • ఉమ్మడి జిల్లా నుంచి 195 బస్సులు
  • చార్జీలు ప్రకటించిన ఆర్టీసీ అధికారులు
  • ఉమ్మడి జిల్లా, ఇతర జిల్లా నుంచి బస్సులు
  • ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు

సంగారెడ్డి టౌన్‌: ఉమ్మడి జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏడుపాయల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వన దుర్గామాతగా వెలుగొందుతూ జిల్లా వాసులనే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ జాతరను నిర్వహిస్తారు. జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా నుంచి 195 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుపనున్నది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌ నుంచి కూడా జాతర కోసం బస్సులను తిప్పనున్నారు. మెదక్‌ రీజియన్‌ పరిధిలోని మెదక్‌ డిపో నుంచి 45 బస్సులు, నారాయణఖేడ్‌ డిపో నుంచి 30 బస్సులు, సంగారెడ్డి డిపో నుంచి 35 బస్సులు, జహీరాబాద్‌ డిపో నుంచి 30 బస్సులు, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ డిపో నుంచి 5 బస్సులు, హైదరాబాద్‌ నుంచి 50 బస్సులను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు ప్రత్యేక రూట్లు కేటాయించారు. కేటాయించిన రూట్లతో జాతర వరకు బస్సులను నడుపుతారు. 

ప్రత్యేక బస్సులకు ధరలు నిర్ణయం

ఏడుపాయల జాతర సందర్భంగా మెదక్‌ రీజియన్‌ నుంచి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ అధికారులు ధరలు నిర్ణయించారు.   

 జాతరకు ప్రత్యేక బస్సులు 

 రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల జాతరకు మెదక్‌ రీజియన్‌ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. మెదక్‌ రీజియన్‌తో పాటు హైదరాబాద్‌ సిటీ నుంచి కూడా బస్సులను ఏర్పాటు చేశాం. ఉమ్మడి జిల్లా వాసులే కాకుండా ఇతర రాష్ర్టాల వారు కూడా జాతరకు పెద్ద ఎత్తున హాజరవుతారు. వారికి ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. ట్రాపిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసుల సహకారంతో జాతర వరకు బస్సులను తిప్పుతాం. ఉమ్మడి జిల్లా, హైదరాబాద్‌ సిటీ నుంచి మొత్తం 195 బస్సులను ఏర్పాటు చేశాం. జాతర కోసం బస్సుల ధరలను కూడా నిర్ణయించాం. దూరాన్ని బట్టి పెద్దలకు, పిల్లలకు ధరలను నిర్ణయించాం. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం. ప్రజలు, భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. 

- ఆర్టీసీ ఆర్‌ఎం రాజశేఖర్‌


logo