సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Feb 15, 2020 , 23:28:14

ద్రవాల భౌతిక ధర్మంపై వర్క్‌షాప్‌

ద్రవాల భౌతిక ధర్మంపై వర్క్‌షాప్‌

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: ద్రవాల భౌతిక ధర్మం, పద్ధతులు, అనువర్తనాలపై 3రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామని గీతం ప్రతినిధి ప్రొఫెసర్‌ కే మారుతీప్రసాద్‌ అన్నారు. శనివారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతినిధి ప్రొఫెసర్‌ కే మారుతీప్రసాద్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో వర్క్‌షాప్‌ వివరాలు అందించారు. పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో  ఈ నెల 20-22 తేదీల్లో ద్రవాల భౌతిక ధర్మం, పద్ధతులు, వాటి అనువర్తనాలపై మూడు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. 

ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌, ఎనలిటికల్‌ టెక్నిక్స్‌, డీటీఎంల ప్రాథమిక మోడలింగ్‌ అంశాలతో ప్రవాహ సమస్యలు, హైడ్రోడైనమిక్‌ అస్థిరత విశ్లేషణ, కనిపించే నాన్‌ లీనియర్‌ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌ను పరిష్కరించడం, గణిత సాఫ్ట్‌వేర్‌తో శిక్షణ పొందడం రెండో విడుత నిర్వహిస్తున్న కార్యశాల ప్రధాన లక్ష్యాలు. వివిధ వ్యవస్థల్లో ద్రవ రవాణా, నిర్దిష్ట నమూనాలు- సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి శిక్షణ కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌, ఐఐఐటీ హైదరాబాద్‌లోని గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పీ అనంతలక్ష్మీనారాయణ, గీతంలోని నిపుణులు ప్రధాన వక్తలుగా ఈ కార్యశాలల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ వర్క్‌షాపులో పాల్గొనదల్చిన వారు డాక్టర్‌ విజయశేఖర్‌ 9700668875, డాక్టర్‌ వంశీకృష్ణ 807440 2980లను సంప్రదించాలని లేదా pfmagitam [email protected]కు మెయిల్‌ చేయాలని కోరారు.


logo