శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Feb 14, 2020 , 23:21:31

అమర జవాన్లకు ఘన నివాళి

అమర జవాన్లకు ఘన నివాళి

జహీరాబాద్‌, నమస్తేతెలంగాణ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని విశ్వహిందూ పరిషత్‌ జిల్లా ఉపాధ్యక్షుడు విశ్వనాథ్‌యాదవ్‌ తెలిపారు. శుక్రవారం జహీరాబాద్‌ పట్టణంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆనందీశ్వర్‌, సాయితేజ, శివకుమార్‌, సతీశ్‌, అంబాదాస్‌, రాజు, రవి పాల్గొన్నారు. 

న్యాల్‌కల్‌లో..

న్యాల్‌కల్‌ : కశ్వీర్‌లోని పుల్వామా జిల్లాలో గతేడాది జరిగి మిలిటెంట్ల ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆమర సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం మండలంలోని హద్నూర్‌ జూనియర్‌ కళాశాలలో స్వామి వివేకానంద సేవా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరులైన జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సుదీప్‌, అధ్యాపకులు అర్జున్‌, యాదగిరి, విప్లవరెడ్డి, శ్రీనివాస్‌, జగదీశ్వర్‌, వివేకానంద సేవా సమితి సభ్యులు నర్సింహారెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

రామచంద్రాపురంలో..

రామచంద్రాపురం : పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్ల చిత్రపటాలకు రాజకీయ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఆర్సీపురం డివిజన్‌లోని షాపింగ్‌ సెంటర్‌ ఏరియాలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకుడు అబ్దుల్‌ గఫర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డివిజన్‌ కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆదర్శ్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై వీర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీరంగూడ కమాన్‌లోని త్రివేణి స్కూల్‌ విద్యార్థులు నివాళులర్పించారు. అదేవిధంగా ఆర్సీపురంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుష్పనగేశ్‌ వీర జనాన్ల చిత్రపటాకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఖదీర్‌, కుత్బుద్దీన్‌, కృష్ణకాంత్‌, మల్లేశ్‌, ఐలేశ్‌, ఎల్లయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


logo