బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Feb 14, 2020 , 23:13:04

అరుదైన రీతిలో వేడుకలు

అరుదైన రీతిలో వేడుకలు
  • 3 వేల మందితో మానవహారం

గజ్వేల్‌అర్బన్‌ :  అరుదైన రీతిలో ఎక్కడా, ఎప్పుడూ చేయని విధంగా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళిలు తెలిపారు. శుక్రవారం గజ్వేల్‌ బాలికల ఎడ్యుకేషన్‌ హబ్‌లో ఎంపీపీ అమరావతి శ్యాంమనోహర్‌, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హ్యూమన్‌ ఎక్సెల్‌ ప్రొక్సిటెన్‌ పద్ధతిలో 3వేల మంది నాయకులు, కార్యకర్తలతో శనివారం గజ్వేల్‌ మహిళా ఎడ్యుకేషన్‌ హబ్‌లో సీఎం కేసీఆర్‌ ముఖ చిత్రాన్ని, గజ్వేల్‌ అభివృద్ధిని, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం వాగుగడ్డ కేసరి హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం గజ్వేల్‌ మున్సిపాలిటీలోని 20 వార్డులలో 5వేల మొక్కలను నాటుతున్నామన్నారు. అలాగే వంద పడకల ప్రభుత్వ దవాఖానలో కేక్‌ కట్‌ చేసి, బ్రెడ్‌ పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేయనున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఆయా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 200ల చొప్పున హరితహారం ప్రత్యేక మొక్కలను నాటుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జకియుద్దిన్‌, మండల పార్టీ అధ్యక్షుడు బెండమధు, కౌన్సిలర్లు రజిత, బాలమణి, శ్రీనివాస్‌, చందు, సలీం, విరాసత్‌, అలీ,  నాయకులు గుంటుకు రాజు, నర్సింగరావు, సలీం తదితరులు పాల్గొన్నారు. 


logo