శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Feb 13, 2020 , 23:12:13

సహకార పోరుకు సర్వం సిద్ధం

సహకార పోరుకు సర్వం సిద్ధం
 • రేపే ‘సహకార’ ఎన్నికలు
 • సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
 • 53 పీఏసీఎస్‌లు, 689 డైరెక్టర్‌ స్థానాలు
 • ఎస్టీలు లేనికారణంగా 10 స్థానాలకు ఎన్నిక నిలిపివేత
 • 262 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం
 • 417 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు
 • 417 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
 • మొత్తం ఓటర్లు 53,560, ఏకగ్రీవ స్థానాల్లో 16,655 ఓటర్లు
 • ఉదయం 7గంటల నుంచి 1గంట వరకు పోలింగ్‌
 • ఆ తర్వాత కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి
 • 16న ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 15న నిర్వహించే సహకార ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శ కంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 53 సహకార సంఘాలు ఉండగా, వీటి పరిధిలో 689 డైరెక్టర్‌ (ప్రాదేశిక నియోజకవర్గం) స్థానాలు ఉన్నాయి. అయితే ఎస్టీలు లేని కారణంగా 10 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగడం లేదు. మిగతా 679 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, ఇందులో 262 స్థానాలు ఏకగ్రీవం అయ్యా యి. దీనితో 417 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 417 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, పోలింగ్‌ సిబ్బందితోపాటు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. శనివారం పోలింగ్‌ నిర్వహిం చనుండగా, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటించనున్నారు.  


ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15వ తేదీన పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా కేంద్రాల వద్ద అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 53 సహకార సంఘాలు ఉండగా, వీటి పరిధిలో 689 డైరెక్టర్‌ (ప్రాదేశిక నియోజకవర్గం) స్థానాలు ఉన్నాయి. అయితే ఎస్టీలు లేని కారణంగా 10 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగడం లేదు. మిగతా 679 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, ఇందులో 262 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీనితో 417 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 417వరకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. 16వ తేదీన ఆఫీసు బేరర్స్‌ సమావేశం నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నట్లు జిల్లా సహకార అధికారి ప్రసాద్‌ నమస్తే తెలంగాణ ప్రతినిధితో వెల్లడించారు.


162 స్థానాలు ఏకగ్రీవం..

జిల్లాలోని 53 సహకార సంఘాల పరిధిలో మొత్తం 162 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాలతో ఓటు వేయనున్న ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. జిల్లాలో 689 డైరెక్టర్‌ స్థానాలు ఉండగా, 10స్థానాలకు ఎస్టీలు లేని కారణంగా ఎన్నికలు నిలిపివేశారు. మిగతా 679 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, 262 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యా యి. మొత్తం 53,560 మంది ఓటర్లు ఉండగా, ఏకగ్రీవాలు అయిన స్థానాల్లో 16,655 మంది ఓటర్లు ఉన్నారు. వారిని మినహాయిస్తే ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న 417 స్థానాల్లో మొత్తం 36,905 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అత్యధికంగా జహీరాబాద్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 36,905 మంది ఓటర్లు ఉన్నారు. 262 వార్డుల్లో 8 పీఏసీఎస్‌లు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. బొక్కాస్‌గావ్‌, కల్హేర్‌, మార్డి, కడ్పల్‌, బానూరు, గుమ్మడిదల, ఏడాకులపల్లి, గంగారం పీఏసీఎస్‌ల్లో 13 వార్డులకు అన్ని వార్డులు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. 


 7 గంటల నుంచి పోలింగ్‌ షురూ

ఈ నెల 15వ తేదీన సహకార పోలింగ్‌ జరుగనున్నది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌ ఉం టుంది. 2 గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించనున్నారు. గెలుపొందిన డైరెక్టర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు అందించనున్నారు. 16వ తేదీన ఆఫీస్‌బేరర్స్‌ సమావేశానికి హాజరుకావాలనేది నోటీసు సారాంశం. ఆ రోజు చేతులు ఎత్తే పద్ధతిలో డైరెక్టర్లు  పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. కోరం లేని పరిస్థితుల్లో మాత్రమే ఎన్నిక వాయిదా వేయనున్నాయి. 16న ఆదివారం అయినప్పటికీ అధికారులు తప్పని సరిగా ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం నిర్వహించాలని జిల్లా సహకార అధికారి ప్రసాద్‌ ఆదేశించారు. కాగా, ఎన్నిక కోసం 417 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నారు. ఇప్పటికే 8 పీఏసీఎస్‌లను సొంతం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ దాదాపుగా అన్నింటిని కైవసం చేసుకునే ధీమాతో ముందుకు సాగుతున్నది. 


logo