బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Feb 13, 2020 , 22:41:07

గీతం విద్యార్థినికి మరో ఐదు అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డులు

గీతం విద్యార్థినికి మరో ఐదు అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డులు

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలోని బీటెక్‌ (సీఎస్‌ఈ) నాలుగో ఏడాది విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ, ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్‌ శ్రీవాస్తవలు సంయుక్తంగా మరో ఐదు అసిస్ట్‌ వరల్డ్‌ రికార్డులు సాధించారు. ఇప్పటికే పది అసిస్ట్‌, తొమ్మిది గిన్నీస్‌, ఒక యూనిక్‌ వరల్డ్‌ రికార్డులను ఆమె కుటుంబం సాధించింది. ఈ రికార్డుతో కలిపి 15 అసిస్ట్‌ రికార్డులు ఆమె పేరున లిఖించబడ్డాయి. హైదరాబాద్‌లోనే పలు రికార్డులు నెలకొల్పిన కుటుంబంగా గుర్తింపు సాధించారు. అత్యధిక సంఖ్యలో 15, 852 ఆరెగామీ, 11,234 క్విలింగ్‌ వస్తువులను ప్రదర్శించడం ద్వారా వారు ఈ రికార్డుకు అర్హత సాధించారు. కాగితాన్ని మడవడం (ఆరెగామీ) ద్వారా రూపొందించిన 6,001 వేల్స్‌, 2,500 పెంగ్విన్‌లు, 1,451 మాప్లీ ఆకులు, 6,000 లెమన్స్‌, కాగితాన్ని మెలితిప్పడం (క్విల్లింగ్‌) ద్వారా రూపొందించిన 1,111 నగలు, 7,011 పూలు, 2,111 బొమ్మలు, 1,001 ఇళ్లను వారు ప్రదర్శనలో ఉంచి ఈ రికార్డును సాధించారు.  రికార్డులను నెలకొల్పుతుతున్న శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ శివప్రసాద్‌, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొఫెసర్‌  శ్రీరామ్‌, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీతారామయ్య, స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీఏ రామారావు, స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీఎస్‌ కుమార్‌, స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సునీల్‌కుమార్‌, జీఎస్‌హెచ్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ప్రభావతి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులను అభినందించారు.


logo